Asianet News TeluguAsianet News Telugu

Chalo Vijayawada:పోలీసుల ఎత్తులకు ఉద్యోగుల పైఎత్తులు... మారువేషాల్లో విజయవాడకు...

విజయవాడ: ఇటీవల వైసిపి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో పాటు దీని అమలుకోసం జారీచేసిన జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. 

విజయవాడ: ఇటీవల వైసిపి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో పాటు దీని అమలుకోసం జారీచేసిన జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉద్యోగ సంఘాల పిలుపుమేరకు ఛలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి ఉద్యోగులు విజయవాడకు బయలుదేరారు. దీంతో పోలీసులు విజయవాడకు వెళ్లే అన్ని మార్గాలను బ్లాక్  చేసి ఉద్యోగులెవ్వరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. చివరకు రైళ్లలో విజయవాడకు చేరడానికి ప్రయత్నించిన ఉద్యోగులకు కూడా స్టేషన్లలోనే అడ్డుకున్నారు.

అయితే ఉద్యోగులు కూడా పోలీసులకు చిక్కకుండా విచిత్రమైన వేషాలను ధరించారు.కొందరు వికలాంగుల మాదిరిగా, మరికొందరు బురఖాలు ధరించి మారువేషాల్లో పోలీసులకు చిక్కకుండా వుండేందుకు ప్రయత్నించారు. ఇక రైల్వేస్టేషన్లలో పోలీసులు మొహరించారని తెలిసి మార్గమధ్యలోనే చైన్ లాగి రైలును ఆపిన ఉద్యోగులు అక్కడి నుండి కాలినడకన వెళుతున్నారు.