Asianet News TeluguAsianet News Telugu

గ్రామాల్లోనూ రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు... నడిరోడ్డుపై మహిళ మెడలోంచి బంగారం చోరీ

పామర్రు : కృష్ణా జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 

First Published Dec 19, 2022, 12:24 PM IST | Last Updated Dec 19, 2022, 12:24 PM IST

పామర్రు : కృష్ణా జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కిరాణా షాప్ నిర్వహించే ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసులను ఇద్దరు దుండగులు లాక్కుని పరారయ్యారు. పామర్రు మండలం కురుమద్దాలి గ్రామానికి చెందిన మాలికాదేవి రాత్రి కిరాణా షాప్ మూసి బైక్ పై ఇంటికి వెళుతుండగా ఇద్దరు దుండగులు ముసుగులు ధరించి బైక్ పై ఆమెను అనుసరించారు. స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ వేగం తగ్గగానే ఒక్కసారిగా దగ్గరకు వచ్చిన దుండగులు మెడలోని రెండు బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు వెంటపడినా దొరక్కుండా తప్పించుకోవడంతో బాధిత మహిళ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసింది. 9 కాసుల బంగారు గొలుసులను దొంగిలించారన్న మాలికాదేవి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ చైన్ స్నాచింగ్ కురుమద్దాలి గ్రామంలో కలకలం రేపింది.