
కేంద్రంలో ఉన్నది మీరేగా పవన్.. సుగాలి ప్రీతి ఫ్యామిలీకి న్యాయం చేయలేరా?: ఆర్కే రోజా
నవ మాసాల్లో మహిళలకు నవ మోసాలను పరిచయం చేసిన కూటమి ప్రభుత్వానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన హామీలతో మహిళలను నమ్మించి, అధికారంలోకి రాగానే పథకాల అమలులో వారికి మొండిచేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ పాలనలోనే మహిళలు నిజమైన సాధికారితను అందుకున్నారని అన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేరా అని ప్రశ్నించారు.