దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన భ్రమరాంబ...

విజయవాడ: అవినీతి ఆరోపణల నేపథ్యంలో దుర్గగుడి ఈవో సురేశ్ బాబుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. 

First Published Apr 8, 2021, 2:03 PM IST | Last Updated Apr 8, 2021, 2:03 PM IST

విజయవాడ: అవినీతి ఆరోపణల నేపథ్యంలో దుర్గగుడి ఈవో సురేశ్ బాబుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో భ్రమరాంబను నియమించింది ప్రభుత్వం. దీంతో ఇవాళ(గురువారం) ఇంద్రకీలాద్రిపై ఈఓ గా బాధ్యతలు స్వీకరించారు భ్రమరాంబ. ప్రముఖ ఆలయాల్లో  విజయవంతంగా విధులు నిర్వహించిన భ్రమరాంబకు విజయవాడ ఆలయ బాధ్యతలు అప్పగించారు. ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భ్రమరాంబ మాట్లాడుతూ... రాజమండ్రి నుండి బదిలీపై ఇక్కడికి వచ్చానన్నారు. అమ్మవారి సన్నిధికి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు.అందరి సహకారంతో తన విధులు సక్రమంగా నిర్వహిస్తానని భ్రమరాంబ పేర్కొన్నారు. 

Video Top Stories