Asianet News TeluguAsianet News Telugu

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అశోక్ గజపతిరాజు...

విశాఖపట్నం : మాజీ కేంద్ర మంత్రి, సింహాచలం ఆలయ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఇవాళ(మంగళవారం) వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.

First Published Dec 13, 2022, 1:02 PM IST | Last Updated Dec 13, 2022, 1:02 PM IST

విశాఖపట్నం : మాజీ కేంద్ర మంత్రి, సింహాచలం ఆలయ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఇవాళ(మంగళవారం) వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సింహాచలం ఆలయానికి చేరుకున్న ఆలయ ఛైర్మన్ కు దేవాదాయ అధికారులు, అర్చకులు మంగళవాద్యాలతో ఘనస్వాగతం పలికారు. ఈవో త్రినాధరావు దగ్గరుండి అశోక గజపతిరాజుకు స్వామివారి దర్శనం చేయించారు. 
అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అశోక్ గజపతిరాజుకు అందించారు.  వరహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంసింహాద్రి అప్పన్న దర్శనం అనంతరం ఆలయ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు కృష్ణాపురం గోశాలతో జరిగిన  ధర్మకర్తల మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈఈ శ్రీనివాసరాజు, ఏఈ హరి, స్థానమాచార్యులు,ధర్మకర్త మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.