Asianet News TeluguAsianet News Telugu

Video: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు తీవ్ర అస్వస్థత

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం అమరావతి సచివాలయంలో పీఏసీ సమావేశం జరుగుతుండగా పయ్యావులకు ఒక్కసారిగా చెమటలు పట్టి, వాంతులు చేసుకున్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది సెక్రటేరియట్‌లోని డిస్పెన్సరికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కేశవ్‌ను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అసిడిటీ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు తెలిపారు.

Video Top Stories