అర్హులందరికీ నేతన్న నేస్తం అందించాలంటూ... ఏపీలో చేనేత కార్మిక సంఘం ఆందోళన
మంగళగిరి : చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ చేనేత, జౌలి శాఖ కార్యాలయం వద్ద రాష్ట్ర చేనేత కార్మిక సంఘం నాయకులు ఆందొళన చేపట్టారు.
మంగళగిరి : చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ చేనేత, జౌలి శాఖ కార్యాలయం వద్ద రాష్ట్ర చేనేత కార్మిక సంఘం నాయకులు ఆందొళన చేపట్టారు. వైసిపి ప్రభుత్వం నేతన్న నేస్తం కొంతమందికే వర్తింపచేస్తోందని... దీంతో చాలామంది అన్ని అర్హతలున్నా ప్రభుత్వ సాయానికి దూరమవుతున్నారని తెలిపారు. కాబట్టి అర్హులైన ప్రతిఒక్కరికీ నేతన్న నేస్తం వర్తింపజూయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.