Agnipath Protests:సికింద్రాబాద్ అల్లర్లతో ఏపీలో హైఅలర్ట్... విజయవాడ రైల్వేస్టేషన్ లో భారీ భద్రత

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

Share this Video

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా ఆందోళనలు చెలరేగాయి. దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్లు చెలరేగడంతో తెలుగురాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యాయి. ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసారు. ఇలా ఏపీలోని విజయవాడ రైల్వేస్టేషన్ లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎవరూ గుడిగూడకుండా చర్యలు చేపట్టారు. ఈ భద్రతా ఏర్పాట్లను విజయవాడ సిపి కాంతి రానా టాటా పరిశీలించారు.

Related Video