Asianet News TeluguAsianet News Telugu

ఆ ప్రభుత్వాలు బిక్ష ఎత్తుకునే చేస్తే.... ప్రాణబిక్ష పెట్టింది జగనన్నే..: 1998 డిఎస్సీ అభ్యర్థుల ఎమోషన్

తాడేపల్లి : దాదాపు 24 ఏళ్ళ నిరీక్షణ తర్వాత 1998 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం దక్కింది. ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చేందుకు వైసిపి ప్రభుత్వం సిద్దమయ్యింది.

తాడేపల్లి : దాదాపు 24 ఏళ్ళ నిరీక్షణ తర్వాత 1998 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం దక్కింది. ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చేందుకు వైసిపి ప్రభుత్వం సిద్దమయ్యింది. దీంతో తమ కష్టాలను చూసి స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 1998 డీఎస్సీ అభ్యర్దులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కల్పలత రెడ్డితో కలిసి సీఎంను కలిసారు అభ్యర్థులు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీతో పాటు డిఎస్సీ అభ్యర్థులు సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు...పోయారు... కానీ వీరికి న్యాయం జరగలేదని... కానీ జగన్ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ అన్నారు. గత ప్రభుత్వాలు మమ్మల్ని బిక్షం ఎత్తుకునెట్లు చేస్తే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మాత్రం ప్రాణబిక్ష పెట్టారని డీఎస్సీ అభ్యర్ధి సోమశేఖర్ అన్నారు. ఏడుగురు సీఎంలు మారినా మా సమస్య పరిష్కారం కాలేదు... అలాంగిది ఈ సమస్యను పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్ చల్లగా ఉండాలని మరో అభ్యర్థి కోమలి కొనియాడారు. 

Video Top Stories