మెక్సికోలో అగాథా హరికేన్ వల్ల సోమవారం మరో ఆరుగురు గల్లంతు అయ్యారని అధికారులు తెలిపారు. ఈ హరికేన్ ప్రభావం వల్ల భారీ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. చాలా మారుమూల గ్రామాలకు కమ్యూనికేషన్ కట్ అయ్యింది.
మెక్సికోను అగాథా హరికేన్ అతలాకుతలం చేస్తోంది. ఈ హరికేన్ వల్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రోడ్లు బ్లాక్ అవుతున్నాయి. ఈ హరికేన్ వల్ల దేశ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి ఏర్పడ్డాయి. దీని ప్రభావంతో సోమవారం ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. అయితే దేశం గతంలో ఈ హరికేన్ వల్ల 11 మంది చనిపోయారని నివేదించింది. అయితే తాజాగా దానిని సవరించింది. మరణాలు 9 మాత్రమే సంభవించాయని పేర్కొంది.
Russia Ukraine war : ఉక్రెయిన్‌లో 20 శాతం రష్యా ఆధీనంలో ఉంది - వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటన
హరికేన్ అగాథా ఈ సంవత్సరం పసిఫిక్ సీజన్ లో ఏర్పడిన మొదటి హరికేన్. కేటగిరీ టూ హరికేన్ గా అగాథా ఓక్సాకాలోని ప్యూర్టో ఏంజెల్ సమీపంలో తీరం దాటింది. అయితే హరికేన్ వల్ల కలిగిన మరణాలు వెల్లడించేందుకు ఓక్సాకా గవర్నర్ అలెజాండ్రో మురాట్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించబడిన తొమ్మిది మరణాలు సంభవించాయని తెలిపారు.
కాగా ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా మెక్సికన్ అధికారులు బుధవారం నాటికి 11 మంది మరణించగా, 22 మంది తప్పిపోయినట్లు నివేదించారు. మారుమూల పర్వత సముదాయాలకు కమ్యూనికేషన్ ప్రస్తుతం నిలిచిపోయింది. ఇది పునరుద్ధరించబడిన తరువాత మరణాల సంఖ్యను సవరించినట్లు వార్తా సంస్థ ఏఎఫ్ పీ నివేదించింది.
Russia Ukraine war: రష్యాకు 2 లక్షల మంది ఉక్రెయిన్ పిల్లలు.. ఉక్రెయిన్-రష్యా వార్ అప్‌డేట్స్
మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ హరికేన్ కారణంగా సంభవించిన మరణాలపై విచారం వ్యక్తం చేశారు. ఈ హరికేన్ బారిన పడిన ఓక్సాకా నివాసితులు ఒంటరిగా లేరని ఆయన అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రహదారులను పునరుద్ధరించడానికి ఆయన పూర్తి సహాయాన్ని అందించారు.
యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్ హెచ్ సీ) ప్రకారం.. ఈ అగాథా 1949 సంవత్సరం నుంచి మే నెలలో మెక్సికోను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను. మెక్సికో వాతావరణ సేవ ప్రకారం.. రాబోయే కొద్ది రోజుల్లో హరికేన్ భాగం అట్లాంటిక్ వైపు కదులుతుంది. మరొక తుఫాను ఏర్పడే అవకాశం 80 శాతం ఉంది. మెక్సికో సాధారణంగా అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల నుండి మే, నవంబర్ నెలల మధ్య ఉష్ణమండల తుఫానుల ప్రభావానికి గురవుతుంది. 2021 లో గ్రేస్ మూడో హరికేన్ మెక్సికోను తాకింది. దీని ప్రభావం వల్ల 11 మంది చనిపోయారు. 1997 లో కేటగిరీ 4 పౌలిన్ హరికేన్ దేశంలోని పసిఫిక్ తీరాన్ని తాకిన తరువాత దాదాపు 200 మంది మరణించారు.