Mexico: సెంట్రల్ మెక్సికోలో దారుణం జరిగింది. హైస్కూల్ విద్యార్థులపై ఆయుధాలతో కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు విద్యార్థులు, మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మెక్సికోలోని గౌనాజాటో ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Mexico: సెంట్రల్ మెక్సికోలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హైస్కూల్ విద్యార్థులపై సాయుధులైన దుండగులు కాల్పలు జరిపారు. ఈ దాడుల్లో ఐదుగురు విద్యార్థులు, ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ఘటన సెంట్రల్ మెక్సికోలోని గౌనాజాటో ప్రాంతంలో సోమవారం జరిగిందని పోలీసు అధికారులు ప్రకటన వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి విద్యార్థుల బృందంపై ముష్కరులు కాల్పులు జరిపారు. మరణించిన విద్యార్థులంతా 16-18 ఏళ్ల లోపు వాళ్లే. ఇందులో ముగ్గురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. అలాగే అదే ప్రాంతంలో ఉన్న 65 ఏళ్ల మహిళ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, ఆసుపత్రికి తరలించారు. మెక్సికోలో కాల్పులు జరగడం చాలా సాధారణంగా మారింది. ఈ ప్రాంతంలో తరుచు కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ గ్యాంగ్‌వార్స్ ఎక్కువగా జరుగుతుంటాయి.
దురదృష్టవశాత్తూ.. కొన్ని గంటల క్రితమే బారన్ కమ్యూనిటీలో ఆరుగురు వ్యక్తులు సాయుధ దాడిలో ప్రాణాలు కోల్పోయారు " అని గ్వానాజువాటో నగర మేయర్ సీజర్ ప్రిటో తెలిపారు. గ్వానాజువాటోలోని సెలయాలోని రెండు బార్‌లు, ఒక హోటల్‌పై గ్యాంగ్‌ల్యాండ్ ప్రతీకార దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పురుషులు కాల్పల్లో మరణించారు.
రెండు వారాల క్రితం కూడా ఒక గ్యాంగ్ వార్ జరిగింది. రెండు గ్యాంగులకు చెందిన సభ్యులు ఒకరిపై ఒకరు జరుపుకొన్న కాల్పుల్లో 11 మంది మరణించారు. దీంతో గ్యాంగ్ వార్‌ల విషయంలో అక్కడి ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరిస్తోంది.
మెక్సికో సంపన్న పారిశ్రామిక కేంద్రం, రిఫైనరీ, ప్రధాన పైప్‌లైన్‌కు గ్వానాజువాటో శాంటా రోసా డి లిమా నిలయం. గ్వానాజువాటో, జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్స్ మధ్య వివాదం తరుచు వివాదాలు తల్లెతుతాయి. మెక్సికోలో అత్యంత హింసాత్మక రాష్ట్రాలలో గ్వానాజువాటో ఒకటి. డ్రగ్స్, ఇంధనాల రవాణా మార్గాల నియంత్రణ కోసం ముఠాలు పోరాడుతాయి.
డిసెంబరు 2006 నుండి ప్రభుత్వం వివాదాస్పద సైనిక మాదకద్రవ్యాల వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించినప్పటి గ్యాంగ్ వార్‌లు ఆగడం లేదు. అధికారిక గణాంకాల ప్రకారం.. మెక్సికో 340,000 కంటే ఎక్కువ హత్యలను నమోదయ్యాయి. వ్యవస్థీకృత నేరాల వల్లే ఎక్కువ హత్యలు జరిగాయని అధికారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గౌనాజాటో రాష్ట్రంలో గ్యాంగ్ వార్స్ చాలా సర్వసాధారణం. డ్రగ్స్, ఆయుధాలు వంటివి సరఫరా చేసే గ్యాంగుల మధ్య ఆధిపత్యం కోసం తరచూ కాల్పులు జరుగుతుంటాయి.