Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీ రద్దు: గుజరాత్ తీర్పు ఏం చెబుతోంది?

అసెంబ్లీని రద్దు చేస్తే  ఆరు మాసాల్లోపుగా  ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారనున్నాయి. గతంలో గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు తీర్పును కొందరు  టీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు.

what is the gujarath Verdict
Author
hyderabad, First Published Sep 6, 2018, 1:36 PM IST


హైదరాబాద్:అసెంబ్లీని రద్దు చేస్తే  ఆరు మాసాల్లోపుగా  ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారనున్నాయి. గతంలో గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు తీర్పును కొందరు  టీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు.  ఈ తీర్పుతో పాటు గతంలో  పలు రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న  పరిణామాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ ఏదైనా కారణంగా ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీని రద్దు చేస్తే  ఆరు మాసాల్లోపుగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులు  అనివార్యమని  గుజరాత్ రాష్ట్రంలో  సుప్రీం కోర్టు తీర్పును టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

2002లో గుజరాత్ అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో ఎన్నికలకు వెళ్తే రాజకీయంగా  తనకు ఎంతో లాభం అనుకున్న నరేంద్రమోడీ.. జూలై 2002లో అసెంబ్లీని రద్దు చేశారు. వెంటనే ఎన్నికలు నిర్వహించమని ఈసీని కోరారు. 

అప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఏప్రిల్‌లో చివరి అసెంబ్లీ చివరి సమావేశం జరిగింది. ఆర్టికల్ 174 ప్రకారం.. ఆరు నెలల్లోగా అసెంబ్లీ సమావేశం జరగాల్సి ఉంది. అంటే రద్దు చేసిన మూడు నెలల్లోపుగా  ఎన్నికలు పూర్తి చేయాలి. లేదా అసెంబ్లిని సమావేశపర్చాల్సి ఉంటుంది. అయితే  ఆనాడు గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

గుజరాత్ లో ప్రశాంత వాతావరణం లేనందున  ఎన్నికలు నిర్వహించలేమని  ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324ను ఉదహరించింది. 

 అంతేకాదు ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆర్టికల్ 174 ప్రకారంగా ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేసింది.  అసెంబ్లీ సమావేశ గడువు ఆరు నెలలు ముగిసిన వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసింది. 

దీనిపై ఆనాడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టును సలహా అడిగింది.  ఈ ఆర్టికల్ 174 , ఆర్టికల్ 324 మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలపై సుప్రీంకోర్టు  నోట్ సమర్పించింది. రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరారు. అప్పుడు సుప్రీంకోర్టు.. ముగ్గురు సభ్యుల బెంచ్‌ను ఏర్పాటు చేసింది. ఆ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇచ్చింది. దీన్నే గుజరాత్ తీర్పుగా చెబుతుంటారు.

రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య  ఆరు మాసాల గడువు ఉండాల్సింది.  అయితే   ఆరు నెలల సమావేశం ఉండాలనేది ఖచ్చితగా  ఉండాలన్నది రద్దు కాని శాసనసభకే వర్తిస్తుందని సుప్రీం కోర్టు ప్రకటించింది.

 రద్దు అయిన శాసనసభకు ఇది వర్తించదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆర్టికల్ 174(1) ప్రకారం గత సమావేశం.. చివరి.. ఈ సమావేశం మొదటి రోజు.. అంటే.. అప్పటికే ఉన్న ఉన్న అసెంబ్లీనే. కొత్త అసంబ్లీ కాదు కదా.. అని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. రద్దయిన శాసనసభకు కూడా.. ఆర్టికల్ 174(1) వర్తిస్తే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. 

 ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన ఐదున్నర నెలల తర్వాత అసెంబ్లీని రద్దు చేశాడనుకుందాం. ఎన్నికల సంఘం.. పదిహేను రోజుల్లో ఎన్నికలు నిర్వహించి కొత్త అసెంబ్లీని సిద్ధం చేసే అవకాశం లేదు.  ఆర్టికల్ 174(1) ప్రస్తుతం ఉన్న శాసనసభలకే వర్తిస్తుంది. 

అసెంబ్లీ రద్దైతే ఎప్పట్లోపు ఎన్నికలు నిర్వహించాలనేది.. మరో సందేహం. దీనికి సంబంధించి ఎక్కడా.. నిబంధనలు లేవు. కానీ… ప్రజాప్రాతినిధ్య చట్టాలు పరిశీలిస్తే.. ఏ ఎన్నిక అయినా సరే ఆరు నెలల్లోపు పెట్టాలనే నిబంధన ఉంది. అదే అసెంబ్లీ రద్దు అయిన వాటికి కూడా వర్తిస్తుంది. ఇవీ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరక్షన్స్.

ఇవాళ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తే  ఆరు మాసాల్లోపుగా  ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.అసెంబ్లీని రద్దు చేసినా.. పార్లమెంట్‌ ఎన్నికలతో సంబంధం లేకుండా ముందస్తు ఎన్నికలు జరుగుతాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios