కర్నూల్: అమరావతి నుండి రాజధానిని మారిస్తే కర్నూల్ ను రాజధాని చేయాలని కర్నూల్ జిల్లాకు చెందిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

బుధవారం నాడు కర్నూల్ లో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.మొట్ట మొదటి రాజధాని కర్నూల్ లో ఉండేదని  ఆయన గుర్తు చేశారు. రాజధానిని కోల్పోవడంతో కర్నూల్ అభివృద్దిలో వెనుకబడిందన్నారు.

శివరామకృష్ణ కమిటీ నివేదికను చంద్రబాబునాయుడుప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. అమెరికా పర్యటన నుండి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన  వెంటనే ఈ విషయమై ఆయనను కలుస్తామన్నారు.

అమరావతి నుండి రాజధానిని తొలగిస్తే కర్నూల్ లో రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఒకవేళ రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తే కర్నూల్ లో హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

విజయవాడకు వెళ్లాలంటే తమకు  ఆరుగంటలకు పైగా సమయం పడుతోందన్నారు. శ్రీశైలం నుండి నీటిని విడుదల చేసుకోవాలంటే తెలంగాణ ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.


సంబంధిత వార్తలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే