Top Stories : సొరంగం నుంచి బైటికి వచ్చిన కూలీలు, తెలంగాణలో ప్రచారం సమాప్తం, ఆటోలో రాహుల్ రయ్ రయ్.. బాబుకు షాక్

తెలంగాణలో ప్రచారం ముగిసింది. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలు బైటికి వచ్చారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా పడింది.  ఆంధ్రప్రదేశ్ లో మరో 5 రోజులు వర్షాలు.. ఇలాంటి వార్తల టాప్ టెన్ స్టోరీస్ ఇవి... 

Top Stories : Labourers came out of the tunnel, Mute campaign in Telangana, Rahul ride in auto, Shock for Chandrababu - bsb

సుఖాంతమైన ఉత్తరాకాశీ  రెస్క్యూ ఆపరేషన్…41మంది  సురక్షితంగా బయటికి…

ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు బయటికి వచ్చారు. 17 రోజులపాటు సొరంగంలో, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతికిన 41 మంది కార్మికులు, రెస్క్యూ టీంల పట్టువదలని శ్రమతో సోమవారం  రాత్రి బయటికి వచ్చారు. నాలుగు రోజుల క్రితమే బయటికి రావాల్సిన కూలీలు.. చివరి నిమిషంలో భారీ యంత్రాలు మొరాయించడంతో.. మరో కొద్ది రోజులపాటు అందులోనే చిక్కుకోవాల్సి వచ్చింది. సొరంగంలో చిక్కుకున్న కూలీలను.. చేరుకోవడానికి కొద్ది మీటర్ల దూరం ఉన్నప్పటికీ.. సాంకేతికనిపుణుల వ్యూహాలు, భారీ యంత్రాలు పనిచేయలేదు. చివరికి నైపుణ్యమున్న ర్యాట్ హోల్ మైనర్లేచిన్న చిన్న పనిముట్లతో.. చిట్టచివరి భాగాన్ని నేర్పుగా తొలగించారు. వెడల్పైన పైపు గొట్టాలను సొరంగంలోకి ప్రవేశపెట్టడానికి సహకరించారు. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ‘మృత్యుంజయులు’ పేరుతో బ్యానర్ ఐటమ్ ను ప్రచురించింది.

పూర్తి కథనం

కేసీఆర్ కు బై బై చెప్పే సమయం వచ్చింది.. రాహుల్ గాంధీ

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాదులో కాంగ్రెస్ అగ్ర నేతలు  చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించారు. రాహుల్ గాంధీ  మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజలకు ఢిల్లీలో.నేను, మా చెల్లి ప్రియాంక  సైనికులం.  మీకు ఏ అవసరం వచ్చినా వెంటనే తెలంగాణకు వస్తాం. తెలంగాణతో మాకు కుటుంబ అనుబంధం ఉంది’  అన్నారు. మా కుటుంబానికి అవసరమైన ప్రతిసారి తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారు.ఇందిరా గాంధీకి అవసరమైనప్పుడు  ఇలా సహకరించారో జీవితాంతం మర్చిపోం. సోనియా గాంధీ  తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రాన్ని ఇచ్చారు. దీన్ని ప్రజల తెలంగాణగా మారుద్దాం’  అని హైదరాబాదులో మంగళవారం జరిగిన రోడ్ షోలో మాట్లాడారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఈ రోడ్ షో బహిరంగ సభలో పాల్గొన్నారు దీనికి సంబంధించిన వార్తను ఈనాడు మెయిన్ పేజీలో ‘కష్టం వచ్చినా  నేను, ప్రియాంక  వస్తాం‘  హెడ్డింగ్ తో ప్రచురించింది 

తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతుంది: రాహుల్

ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ కష్టాలే.. కేసీఆర్

తెలంగాణ ఎన్నికల  ప్రచారంలో చివరి రోజు అయిన మంగళవారం నాడు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ వరంగల్, గజ్వేల్లలో బహిరంగ సభల్లో మాట్లాడారు. ‘కాంగ్రెస్ నాయకులు తాము గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి..ఎమర్జెన్సీలు, కర్ఫ్యూలు, సగం కాలిన కడుపులు, ఎన్కౌంటర్లు, రక్తపాతాలు,  కరెంటు కోతలు’  ఇవే అన్నారు. ఈ కష్టాలతో నిత్యం ప్రజలు కన్నీరు కార్చడం, ఆ రాజ్యం మళ్లీ మనం తెచ్చుకోవద్దని చెప్పుకొచ్చారు.వీఆర్ఎస్ తెలంగాణను సాధించి, ప్రగతి మార్గంలో నడిపిస్తుందని  ఆలోచించి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు.దీనికి సంబంధించిన వార్తను ఈనాడు బ్యానర్ ఐటంగా ‘అభివృద్ధిని చూడండి.. ఆశీర్వదించండి’ అనే పేరుతో ప్రచురించింది.

KCR : ఇందిరమ్మ రాజ్యమే బాగుంటే..- సీఎం కేసీఆర్

ముగిసిన ఎన్నికల ప్రచారం…

తెలంగాణలో ఎన్నికల ప్రచార సమయం ముగిసింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచార గడుపు ముగియడంతో అన్ని ప్రధాన పార్టీల అగ్రనేతలు సభలు, రోడ్ షోలు ఆపేశారు.  దీంతో గత నెల రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ ప్రచారాలు, సభలు,  కార్నర్ మీటింగులు, సమావేశాలతో హోరెత్తిన తెలంగాణ మొత్తం  ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది.  పోలింగ్కు ఒక్కరోజే మిగిలి ఉంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వార్తను…‘ ఇక మాటల్లేవ్..’ అనే పేరుతో ఈనాడు మెయిన్ పేజీలో ప్రచురించింది.

Telangana Assembly Elections 2023: తెలంగాణలో ముగిసిన ప్రచారం...

ఏపీ ఇంధన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం

ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  మంగళవారం ఒకేసారి వర్చువల్ విధానంలో 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.12 సబ్స్టేషన్లను ప్రారంభోత్సవం చేశారు.రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే తొలిసారి. కడపలో 750 మెగావాట్లు,  అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ మొత్తం సబ్ స్టేషన్లు, విద్యుత్ ప్రాజెక్టుల విలువ రూ. 6,500 కోట్లు.  దీనికిగాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్పిసిఎల్ తో రూ. పదివేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై ఒప్పందం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వార్తను సాక్షి బ్యానర్ ఐటమ్ గా ప్రచురిస్తూ ‘ పవర్ ఫుల్..’ అని  హెడ్డింగ్ పెట్టింది.

నారాయణ సంస్థల ఉద్యోగులకు దేహశుద్ధి...

ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. నారాయణ విద్యాసంస్థల  అధినేత, టిడిపి మాజీమంత్రి పొంగూరు నారాయణ చేసిన ఈ రాజకీయంలో వీరు బలి పశువులుగా మారారు.ఓటర్ వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న నారాయణ సంస్థల సిబ్బందిని, ఉపాధ్యాయులను ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది.  దీనికి సంబంధించిన వార్తను సాక్షి మెయిన్ పేజీలో.. ‘ ఇదేం పని నారాయణ..’ అనే పేరుతో ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్లో మరో ఐదు రోజులు వర్షాలు…

బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.  మొదట తుఫాను ప్రభావం రాష్ట్రాలపై తక్కువగా ఉంటుందని అంచనా వేసింది.  కానీ మంగళవారం నాడు ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకే  తుఫాను ప్రభావాన్ని తెలిపే సైక్లోన్ ట్రాక్ పరిమితం కావడంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చింది. దీంతో ఏపీవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది దీనికి సంబంధించిన వార్తని సాక్షి.. ‘ ఏపీపై తుఫాను ప్రభావం’  పేరుతో మెయిన్ పేజీలో ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు..

బెయిల్ పిటిషన్  11వ  తేదీకి  వాయిదా  వేసిన సుప్రీం

స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై బెయిలుపై బయట ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి హైకోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిమీద సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఏపీ సిఐడి. సుప్రీంకోర్టులో మంగళవారం ఈ కేసుకు సంబంధించిన విచారణను. క్వాష్ పిటిషన్ పై తీర్పు విలువరించిన తర్వాతే బెయిల్ రద్దు కేసు విచారణ చేపడతామని తెలిపింది. విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.  ఈ వార్తను సాక్షి మెయిన్ పేజీలో ‘చంద్రబాబుకు ‘సుప్రీం’  నోటీసులు పేరుతో ప్రచురించింది.

పూర్తి కథనం

నాయకులంతా గ్రేటర్ లోనే…

తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజు గ్రేటర్ హైదరాబాదులో ప్రచారాన్ని హోరెత్తించారు అని ఓ ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో ‘ కదిలి వచ్చారు..  కలియతిరిగారు.. ’ అనే పేరుతో ప్రచురించింది. ప్రత్యేక ఆకర్షణగా మోదీ, అమిత్ షా,  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఉన్నట్టుగా ఈ కథనం పేర్కొంది.  చివరి రోజు గ్రేటర్లో పలుచోట్ల కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు.  మంత్రి హరీష్ రావు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు అని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన సమగ్ర కథనాన్ని ప్రచురించింది.

ఆటోవాలా రాహుల్…

 తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనదైన  శైలిలో ప్రచారాన్ని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాదులోని అశోక్ నగర్ లో నిరుద్యోగులతో భేటీ అయ్యారు. ప్రచారం చివరి రోజు మంగళవారం వివిధ రంగాల కార్మికులతో సమావేశమయ్యారు. ఈ ఆటోలో  ప్రయాణించారు.  యూసుఫ్ గూడా నుంచి నాంపల్లి వరకు ఆటోలో ప్రయాణించారు.  అన్ని రంగాల కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో ప్రచురించింది.

డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లు, జీహెచ్ఎంసీ వర్కర్లతో రాహుల్ గాంధీ సమావేశం..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios