సారాంశం

andhra pradesh Weather : ఏపీలోని పలు జిల్లాలో మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. 

WEATHER UPDATE  :  ఆంధ్రప్రదేశ్ (andhra pradesh)లో రాబోయే మూడు రోజుల పాట వర్షాలు (rains)పడే అవకాశం ఉంది. బంగాళాఖాతం (Bay of Bengal)లో దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధి (Malacca Strait) ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనమే ఈ వానలకు కారణం. ఈ అల్పపీడన పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. అది బుధవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం (Amaravati Meteorological Center) తెలిపింది. 

Jayamangala Venkataramana :మూడో పెళ్లి చేసుకున్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ.. సాక్షి సంతకం చేసిన రెండో భార్య..

ఈ వాయుగుండం వాయువ్య దిశగా కదిలి, రాబోయే 48 గంటల్లో తుఫాన్ (storm)గా మారే అవకాశం కనిపిస్తోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఏపీలో దిగువ ట్రోపో ఆవరణ (Lower tropo enclosure) లో తూర్పు గాలులు వీస్తుండటంతో.. వచ్చే మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ వానలు మోస్తారు నుంచి తేలికపాటి తీవ్రతతో ఉండవచ్చు. అయితే నేడు (మంగళవారం) తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాలో మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.