Telangana Elections 2023 : డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లు, జీహెచ్ఎంసీ వర్కర్లతో రాహుల్ గాంధీ సమావేశం..

రాహుల్ గాంధీ హైదరాబాద్ లో వివిధ వర్గాల వారితో సమావేశం అయ్యారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం రాగానే కావల్సిన చర్యలు చేపడతామని తెలిపారు. 

Telangana Elections 2023 : Rahul Gandhi meeting with delivery boys, auto drivers, GHMC workers - bsb

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కొద్ది గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ లో ప్రచారం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే నగరంలో వివిధ వర్గాలతో రాహుల్ గాంధీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ వర్కర్లు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తో సమావేశం అయిన రాహుల్ గాంధీ వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఓ డెలివరీ బాయ్ తో మాట్లాడుతూ.. రోజువారీ వారి దినచర్య ఎలా ఉంటుంది? ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో.. అడిగి శ్రద్ధగా విన్నారు.

తమ సమస్యలను పరిష్కరించాలని డెలివరీ బాయ్స్ రాహుల్ గాంధీని కోరారు. యాక్సిడెంట్ అయినా, ఐటమ్స్ డామేజ్ అయినా డెలివరీ ఏజెన్సీలు పట్టించుకోవని తెలిపారు. కస్టమర్, కంపెనీల మధ్య నలిగిపోతున్నామని తెలిపారు. కస్టమర్స్ ఎలా ఇబ్బందులు పెడతారో వివరించారు. కంపెనీ పెట్రోల్  ఖర్చులు ఇవ్వదని, కస్టమర్ చివరి నిమిషంలో క్యాన్సల్ చేస్తే ఆ భారం తమ మీద పడుతుందని తెలిపారు. ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని కోరారు.

Telangana Elections 2023 : కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలను వెంటనే ఆపేయండి.. ఈసీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే దీని విషయంలో దృష్టి పెడతామని రాజస్థాన్ లో తాము చేపట్టినట్టుగా సంక్షేమ చర్యలు చేపడతామన్నారు. 

జీహెచ్ఎంసీ వర్కర్లు మాట్లాడుతూ.. తమకు పెన్షన్లు లేవని.. పనికి వెళ్లని రోజు జీతం కట్ చేస్తారని తెలిపారు. ఐదు గంటల వరకు థంబ్ వేయాల్సిందేనని చెప్పారు. చీపురుతో నిత్యం ఊడవడం వల్ల ఛాతిలో తీవ్ర నొప్పి వస్తుందని తెలిపారు. వీటన్నింటినీ రాహుల్ గాంధీ శ్రద్ధగా విన్నారు. వారి రోజువారీ దినచర్య ఎలా ఉంటుందో చెప్పమని అడిగి తెలుసుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios