రూ.500కు గ్యాస్ సిలిండర్ పొందాలంటే.. ఆ కార్డు తప్పనిసరి ?

రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఎవరు కాదు ? అనే విషయంలో పౌర సౌర అధికారులు ఇప్పటికే నిబంధనలు రూపొందించారని సమాచారం. 

To get a gas cylinder for Rs. 500.. is that card mandatory?..ISR

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. అలాగే ఆరోగ్య శ్రీ కింద ఆరోగ్య బీమా పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. తాజాగా మరో పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. 

తైవాన్ లో భారీ భూకంపం..

ఈ నెల 28వ తేదీ నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. అయితే దాని కోసం పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పథకం ఎవరికి వర్తింపజేయాలనే విషయంలో వారు ఓ స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. రేషన్ కార్డు ప్రాతిపాదికన అర్హులను ఎంపిక చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ కార్డు ఉన్న వారికే రూ.500 సిలిండర్ పథకాన్ని వర్తింపజేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. 

ఆపరేషన్ చేస్తుంటే కదిలిందని రోగిని పదే పదే కొట్టిన డాక్టర్.. వీడియో వైరల్

ఈ పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు లబ్దిదారుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలనే రూల్ ను కూడా అధికారులు ప్రతిపాదనల్లో పేర్కొన్నట్టు సమాచారం. అయితే తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చాలా కాలంగా నిలిచిపోయింది. దీంతో చాలా మంది ఎల్పీజీ వినియోగదారులకు రేషన్ కార్డులు లేవు. దీంతో గ్యాస్ సిలిండర్ రూ.500 వచ్చే పథకానికి రేషన్ కార్డు నిబంధన పెడితే అలాంటి వారు నష్టపోయే అవకాశం ఉంది.

CM Revanth Reddy: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్..!

అందుకే ప్రభుత్వం అర్హులకు కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేసేందుకు కూడా కసరత్తు చేస్తోంది. దీని కోసం అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. ఆన్ లైన్ లో మీ సేవ కేంద్రాల ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత గ్రామాల్లో అయితే గ్రామ సభలు, పట్టణాల్లో అయితే బస్తీ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. 

తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు మహిళ చేతికి... ఎవరీ దీపాదాస్ మున్షీ?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొత్తంగా ఇప్పటి వరకు 6,47,297 జారీ అయ్యాయి. అయితే చాలా కాలంగా కొత్త దరఖాస్తులను స్వీకరించడం లేదు. అలాగే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పించడం లేదు. దీంతో కొత్తగా పెళ్లైన జంటలకు రేషన్ కార్డులు అందలేదు. అలాగే ఇప్పటికే కార్డుల్లో వారి పిల్లల పేర్లు చేర్చడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందజేసి, తరువాత రేషన్ కార్డులు వచ్చిన వారికీ కూడా అందజేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios