ఆపరేషన్ చేస్తుంటే కదిలిందని రోగిని పదే పదే కొట్టిన డాక్టర్.. వీడియో వైరల్
ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఓ డాక్టర్ రోగిని కొట్టాడు. దీనికి సంబంధించి సమాచారం అందడంతో చైనా అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
చైనా : చైనాలో ఈ వారం ఓ వీడియో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆ వీడియోకు తెగ షేర్లు, లైక్ లు, కామెంట్లు వచ్చాయి. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ ఆపరేషన్ థియేటర్ లో రోగిని డాక్టర్ కొడుతున్నాడు. అయితే, ఈ వైరల్ వీడియో ఎప్పటిది అనే ఖచ్చితమైన తేదీ, సమయాన్ని లేదు.
ఈ వీడియో వెలుగు చూడడంతో ఆసుపత్రి పేరెంట్ గ్రూప్ అయిన ఎయిర్ చైనా ఆ వీడియోలో ఉన్న సర్జన్‌ను సస్పెండ్ చేసింది. 2019లో ఈ ఘటన జరిగిందని.. ఆ సమయంలో ఆస్పత్రి సీఈవోగా ఉన్న వ్యక్తిని కూడా విధుల నుంచి తొలగించారని తెలిపారు.
ఈ వీడియోలో ఓ వ్యక్తి కళ్లకు ఆపరేషన్ చేస్తున్నారు. ఆ సమయంలో సర్జన్ రోగి తలపై కనీసం మూడు సార్లు కొట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆపరేషన్ గదిలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.
కాలిఫోర్నియాలో హిందూ ఆలయ గోడలపై భారత వ్యతిరేక, ఖలిస్థాన్ అనుకూల గ్రాఫిటీ
Aier చైనా కంటి హాస్పిటల్స్ చైన్ ను నిర్వహిస్తోందని బీబీసీ నివేదించింది. నైరుతి చైనాలోని గుయిగాంగ్‌లోని తన ఆసుపత్రిలో ఆపరేషన్ సమయంలో ఈ సంఘటన జరిగిందని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.
రోగి 82 ఏళ్ల వృద్ధురాలని, ఆమెకు లోకల్ అనస్థీషియా కారణంగా శస్త్రచికిత్స సమయంలో అసహనంగా కదులుతోందని.. నివేదిక పేర్కొంది. ఆమె తన తల, కళ్లను చాలాసార్లు కదిలించిందని తెలిపింది. సర్జన్ "అత్యవసర పరిస్థితిలో రోగికి సుమారుగా చికిత్స చేయగలిగాడు" ఎందుకంటే రోగి స్థానిక మాండలికం మాత్రమే మాట్లాడగలదు.
మాండరిన్‌లో డాక్టర్ హెచ్చరికలకు ఆమె స్పందించలేదని నివేదిక పేర్కొంది. వీడియోలో కూడా అది కనిపిస్తుంది. ఆమె నుదిటిపై గాయాలు ఉన్నాయని స్థానిక అధికారులు తెలిపారు. ఆమె కుమారుడు స్థానిక మీడియా సంస్థలతో మాట్లాడుతూ, ఆసుపత్రి యాజమాన్యం క్షమాపణలు చెప్పిందని, శస్త్రచికిత్స తర్వాత పరిహారంగా $70 చెల్లించిందని చెప్పాడు.
స్థానిక మీడియాలో నివేదించినట్లుగా, తన తల్లి ఇప్పుడు ఎడమ కంటి చూపు కోల్పోయిందని పేర్కొన్నాడు. అయితే ఈ ఘటన వల్లే ఆమె చూపు కోల్పోయిందని నిర్ధారించలేమని అంటున్నారు.