CM Revanth Reddy: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్..!

CM Revanth Reddy: ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరి బాయ్స్ కోసం రూ.5 లక్షల 'యాక్సిడెంటల్ పాలసీ' తీసుకురావడంతోపాటు 'రాజీవ్ ఆరోగ్యశ్రీ' ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

CM Revanth Reddy declares Rs.5 lakh accidental insurance, Rs.10 lakh free treatment for Swiggy delivery boys, cab, auto drivers KRJ

CM Revanth Reddy: ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరి బాయ్స్ కోసం రూ.5 లక్షల 'యాక్సిడెంటల్ పాలసీ' తీసుకురావడంతోపాటు 'రాజీవ్ ఆరోగ్యశ్రీ' ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 4 నెలల క్రితం స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటనలో మృతుడి కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిది నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటుమన్నారు. సామాజిక  రక్షణ కల్పించడంలో మా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని శ్రీ రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆ క్రమంలో  విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్థాన్ లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్ధవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. 

గివ్ అండ్ టేక్ పాలసీ తప్పని సరి..

ఇక సంస్థలు కూడా కేవలం లాభాపేక్ష మాత్రమే చూడకుండా..కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. గివ్ అండ్ టేక్ పాలసీ ని పాటించని సంస్థలపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 4 నెలల క్రితం స్విగ్గి బాయ్ కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందిన విషయం తెలిసిందే..  ఈ విషయంపై గత ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోలేదు. బాధిత కుటుంబానికి ఎలాంటి సాయం అందించలేదు. ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో మానవత్వంతో వ్యవహరించాలనీ, అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని సీఎం అధికారులకు ఆదేశించారు.

28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభలు 

ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన గ్రామసభలు నిర్వహిస్తున్నామని, ఈ సభల్లో అక్కడ దరఖాస్తుల్లో మీ వివరాలు అందించాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్లకు సీఎం  రేవంత్ రెడ్డి సూచించారు. డిజిటల్, మాన్యువల్ ఏ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చు అన్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ సెక్రెటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, మధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios