తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు మహిళ చేతికి... ఎవరీ దీపాదాస్ మున్షీ?

తెలంగాణ ఇంచార్జీగా దీపాదాస్ నియామకంతో ఒక్కసారిగా ఆమె పేరు రాష్ట్రంలో మారోమోగుతోంది. ఆమె ఎవరు? తెలంగాణ ఇంచార్జీగా ఆమెనే ఎందుకు నియమించారు? అనే అంశాలపై కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు ప్రజల్లో చర్చ సాగుతోంది.

Telangana Congress Incharge Deepa Dasmunshi detailed Profile AKP

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆగిపోయాయి... విజయవంతగా ఎన్నికలను పూర్తి చేసుకుని అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా సీనియర్ నాయకులు బాధ్యతలు స్వీకరించారు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతా సాఫీగా జరుగుతున్న వేళ అదిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా వ్యవహరించిన మాణిక్ రావు థాక్రేను సడన్ గా తొలగించి దీపాదాస్ మున్షీకి ఆ బాధ్యతలు అప్పగించారు. ఇక థాక్రేను గోవా ఇంచార్జీగా నియమించారు. 
 
తెలంగాణ ఇంచార్జీగా దీపాదాస్ నియామకంతో ఒక్కసారిగా ఆమె పేరు రాష్ట్రంలో మారోమోగుతోంది. ఆమె ఎవరు? తెలంగాణ ఇంచార్జీగా ఆమెనే ఎందుకు నియమించారు? అనే అంశాలపై కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు ప్రజల్లో చర్చ సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓ మహిళను తెలంగాణ ఇంచార్జీగా నియమించడం వెనుక కాంగ్రెస్ వ్యూహమేమిటోనని ప్రత్యర్థి పార్టీల్లోనూ దీపాదాస్ నియామకంపై చర్చ సాగుతోంది. 

ఎవరీ దీపాదాస్ మున్షీ? 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలే ఈ దీపాదాస్  మున్షీ. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రియరంజన్ దాస్ భార్యగా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె అతి తక్కువకాలంలోనే జాతీయస్థాయి నాయకురాలిగా ఎదిగారు. ఎంపీగా ఎన్నికైన మొదటిసారే దీపాదాస్ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసారు.  

దీపాదాస్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 1960 జూలై 15 బినోయ్-దుర్గా ఘోష్ దంపతులకు ఆమె జన్మించారు. ఆమెప్రాథమిక, ఉన్నత విద్యాబ్యాసం అంతా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోనే కొనసాగింది. నటనపై ఆసక్తితో ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ యూనివర్సిటీలో ఎంఏ డ్రామెటిక్స్ చేసారు. తన నటనతో అందరినీ అబ్బురపర్చిన దీపాదాస్ యూనివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత పలు టీవి ఆర్టిస్ట్ గా, కాస్ట్యూమ్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసారు.  

Also Read  మాణిక్ రావ్ థాక్రేపై వేటు .. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా దీపా దాస్ మున్షీ , ఏపీకి ఠాగూర్

అయితే కాంగ్రెస్ నాయకుడు ప్రియరంజన్ దాస్ మున్షీతో పెళ్లి తర్వాత దీపాదాస్ జీవితం మరో మలుపు తిరిగింది. భర్త అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో అడుగుపెట్టిన దీపా 2006 లో గోల్ఫోఖర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇలా రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్లిన ఆమె చాలా తక్కువకాలంలోనే కీలక నాయకురాలిగా ఎదిగారు. దీంతో  2009  లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాయిగంజ్ నుండి ఎంపీగా పోటీచేసి గెలిచారు. 2012 లో మన్మోహన్ సింగ్ కేబినెట్ లో అర్బన్ డెవలప్ మెంట్ మంత్రిగా దీపాదాస్ కు అవకాశం దక్కింది. 

2017 లో భర్త ప్రియరంజన్ దాస్ మున్షీ మరణం దీపాదాస్ జీవితంలో విషాదాన్ని  నింపింది. అయితే ఆ బాధనుండి బయటపడేందుకు ఆమె రాజకీయాల్లో మరింత బిజీ అయ్యారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఆమెకు ఇప్పటికే అనేక అవకాశాలిచ్చిన అదిష్టానం తాజాగా  తెలంగాణ ఇంచార్జీగా నియమించింది. ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ను ముందుండి నడిపించే అవకాశం ఆమెకు దక్కింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios