హైదరాబాద్‌: టీఆర్ఎస్ పార్టీపైనా, తమ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.  కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పొల్గొన్న మంత్రి తలసాని నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు.

దేశంలో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తున్నారా? అంటూ బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నారా? అంటూ నిలదీశారు. గతంలో తాగడానికి నీరులేక ప్రజలు ఇబ్బంది పడేవారని అయితే మిషన్‌ భగీరథతో పల్లెలు, పట్టణాల్లో నీటి బాధలు తీర్చామని చెప్పుకొచ్చారు. 

షెడ్యూల్‌ ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయని తెలిపిన మత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో కంటే ఎక్కువ సీట్లు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

రాజకీయాల్లో అవుట్ డేటెడ్.. కేసీఆర్ పై బాబు మోహన్ విమర్శలు

బీజేపీలోకి టీఆర్ఎస్ నేత.... కిషన్ రెడ్డితో మంతనాలు

దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే సత్తా బీజేపీకే ఉంది: జేపీ నడ్డా

తల్లిలాంటి టీడీపీని వదిలి మనసు చంపుకుని బీజేపీలో చేరుతున్నా: గరికపాటి

హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పర్యటన (ఫోటోలు)

మన టార్గెట్ బీజేపీ జెండా ఎగురవేయడమే: టీ-బీజేపీ నేతలతో జేపీ నడ్డా

శంషాబాద్‌ చేరుకున్న జేపీ నడ్డా, ఘనస్వాగతం పలికిన నేతలు