హరికృష్ణ అంత్యక్రియలు.. ఎవరికీ ఏ లోటు రానివ్వం:కేటీఆర్

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 29, Aug 2018, 6:29 PM IST
Telangana Minister ktr about harikrishna funeral arrangements
Highlights

రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు రేపు సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 

రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు రేపు సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

తొలుత మొయినాబాద్‌లోని నందమూరి వ్యవసాయం క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయని ప్రచారం జరిగింది. అయితే  కుటుంబసభ్యుల కోరిక మేరకు మహాప్రస్థానంలోనే అంత్యక్రియలు నిర్వహించున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు.

ప్రభుత్వం తరపునన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని.. హరికృష్ణకు నివాళులర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తామన్నారు. ఈ కష్టసమయంలో నందమూరి కుటుంబసభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి:

కొడుకు కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు!

హిందూపురంతో హరికృష్ణ బంధం ఇదీ...

అన్నయ్యని చూస్తే నాన్నగారు గుర్తొచ్చేవారు.. బాలకృష్ణ స్పందన!

'ఏమోయ్ పోసాని.. నాకు డబ్బులివ్వవేంటి' అని హరికృష్ణ అడిగారు!

హరికృష్ణ కార్ యాక్సిడెంట్.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..

హరికృష్ణ మృతి..బోసిపోయిన అఖిలప్రియ పెళ్లి మండపం

loader