అన్నయ్యని చూస్తే నాన్నగారు గుర్తొచ్చేవారు.. బాలకృష్ణ స్పందన!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 29, Aug 2018, 6:59 PM IST
balakrishna speech at harikrishna's house
Highlights

నందమూరి హరికృష్ణ అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులను కూడా కలచి వేస్తోంది. ఒక్కొక్కరిగా హరికృష్ణ ఇంటికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు

నందమూరి హరికృష్ణ అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులను కూడా కలచి వేస్తోంది. ఒక్కొక్కరిగా హరికృష్ణ ఇంటికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. తన అన్నయ్య చనిపోయాడనే విషయం తెలుసుకున్న బాలకృష్ణ ఉదయం నుండి హరికృష్ణ మృతదేహం వద్దే ఉన్నారు. ఇప్పుడు మీడియా ముందుకొచ్చిన ఆయన..

''ఎప్పుడు ఊరికి వెళ్లినా అందరినీ పలకరిస్తూ.. రాజకీయ పార్టీల్లో కూడా అందరితో కలుపుగోలుతనంతో ఉండేవారు. ఆయన మరణం మాకు మాత్రమే కాదు అభిమానులకు కూడా తీరనిలోటు. ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కూడా బంధుత్వానికి, సంప్రదాయానికి, సంస్కృతికి ప్రాముఖ్యత నిచ్చే మనిషి. ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా ఆయనే ముందుడేవారు. ఆయన కలుపుగోలుతనం, హుందాతనం చూస్తే నాన్నగారు గుర్తొచ్చేవారు.

ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకరోజు చనిపోవాల్సిందే.. కానీ ఇలా చనిపోవడం బాధగా ఉంది. ఆయన మనముందు లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా  ఆయనకి వెళ్లిపోయే సమయం వచ్చిందని అనుకోవాలి. ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అంటూ తెలిపారు.  

ఇవి కూడా చదవండి.. 

'ఏమోయ్ పోసాని.. నాకు డబ్బులివ్వవేంటి' అని హరికృష్ణ అడిగారు!

హరికృష్ణ నా సోదర సమానులు.. ఎమోషనల్ అయిన చిరంజీవి!

కౌగిలించుకుని జూ. ఎన్టీఆర్ ను ఓదార్చిన కేసిఆర్ (ఫొటోలు)

loader