'ఏమోయ్ పోసాని.. నాకు డబ్బులివ్వవేంటి' అని హరికృష్ణ అడిగారు!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 29, Aug 2018, 6:33 PM IST
posani krishnamurali comments on harikrishna
Highlights

సినీ నటుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన అకాల మరణంపై సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

సినీ నటుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన అకాల మరణంపై సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు హరికృష్ణ భౌతికాయాన్ని దర్శిస్తూ ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నటుడు పోసాని కృష్ణమురళి.. హరికృష్ణ మృతిపై స్పందిస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.

హరికృష్ణ ప్రధాన పాత్రలో నటించి.. హీరో కృష్ణతో కలిసి నవ్వులు పోయిన చిత్రం 'శ్రావణమాసం'. ఈ సినిమా దర్శకనిర్మాత పోసాని కృష్ణమురళి.. హరికృష్ణ వ్యక్తిత్వానికి సంబంధించి ఓ విషయాన్ని బయటపెట్టారు. ''శ్రావణమాసం సినిమా ఫ్లాప్ అయింది. ఆ సమయంలో నేను హరికృష్ణ గారికి రెండు లక్షలు బాకీ పడ్డాను. ఆయన తన ఇంటికి పిలిపించి 'ఏమోయ్ పోసాని.. నాకు డబ్బులివ్వవేంటి' అని అడిగారు. 'అన్నా.. సినిమా ఫ్లాప్ అయింది వచ్చే నెల ఇస్తాను' అని చెప్పాను.

దానికి ఆయన.. ఏమీ ఇవ్వక్కర్లేదని, టీ తాగి వెళ్లమని చెప్పారు. డబ్బులేమీ ఇవ్వక్కర్లేదని అన్న మనిషి హరికృష్ణ'' అని ఆయన వ్యక్తిత్వం గురించి వివరించారు పోసాని. 

ఇవి కూడా చదవండి.. 

హరికృష్ణ నా సోదర సమానులు.. ఎమోషనల్ అయిన చిరంజీవి!

కారు నడుపుతూ చనిపోయారా..? నమ్మలేకపోతున్నా: దర్శకేంద్రుడు!

హరికృష్ణ మోసపోయారు.. పోసాని సంచలన కామెంట్స్!

loader