హిందూపురంతో హరికృష్ణ బంధం ఇదీ...

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 29, Aug 2018, 3:27 PM IST
Harikrishna good relations with hindupur segment people
Highlights

అనంతపురం జిల్లా హిందూపురంతో  సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణకు విడదీయరాని సంబంధం ఉంది. తండ్రి  ప్రాతినిథ్యంవహించిన హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి హరికృష్ణ ప్రాతినిథ్యం వహించాడు.


అనంతపురం:అనంతపురం జిల్లా హిందూపురంతో  సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణకు విడదీయరాని సంబంధం ఉంది. తండ్రి  ప్రాతినిథ్యంవహించిన హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి హరికృష్ణ ప్రాతినిథ్యం వహించాడు.

మాజీ ఎంపీ, టీడీపీ నేత  నందమూరి హరికృష్ణ  అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1996 నుండి 1999 వరకు ప్రాతినిథ్యం వహించాడు. 1994లో ఎన్టీఆర్ హిందూపురం నుండి విజయం సాధించారు.

అయితే టీడీపీలో చోటు చేసుకొన్న సంక్షోభం  తర్వాత హరికృష్ణ  చంద్రబాబునాయుడు వైపు నిలిచారు. 1996 జనవరి 18వ తేదీన ఎన్టీఆర్ మరణించాడు.ఎన్టీఆర్ మరణించిన తర్వాత  హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో హరికృష్ణ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 

ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన స్థానం నుండి తాను కూడ ప్రాతినిథ్యం వహించడం పట్ట ఆయన ఎప్పుడూ సంతోషాన్ని వ్యక్తం చేసేవారు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల రవితో కూడ హరికృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉండేవి.

హిందూపురం నియోజకవర్గానికి చెందిన నేతలతో కూడ ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలిన ఆయన భావించినా ఆ తర్వాత పార్టీలో పరిణామాల నేపథ్యంలో ఆయనకు కలిసిరాలేదు.

రాజ్యసభకు టీడీపీ తరపున  2008లో ఆయన  ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ  రాజ్యసభ పదవీ కాలం పూర్తి కాకముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబునాయుడు 2012లో పాదయాత్రను అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుండి ప్రారంభించిన సమయంలో హరికృష్ణ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

అనంతపురం జిల్లా నేతలు కూడ హరికృష్ణను అమితంగా ప్రేమించేవారు.  హరికృష్ణ ఎక్కడ కలిసినా ఆ జిల్లాకు చెందిన నేతలు ఆప్యాయంగా పలకరించేవారు.ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుండి హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 

ఈ వార్తలు చదవండి

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?

కొంపముంచిన నిర్లక్ష్యం: సీటు బెల్ట్ పెట్టుకోక చనిపోయిన ప్రముఖులు వీరే

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం
 

loader