హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం, సన్నిహితులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు

హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం, సన్నిహితులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా హరికృష్ణ ఇద్దరు కొడుకులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు తండ్రిని తలచుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జానకిరామ్ ని పోగొట్టుకున్న కొంతకాలానికే హరికృష్ణ కూడా మరణించడంతో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

తమ సినిమాల ఫంక్షన్స్ కి తండ్రి వెంటబెట్టుకొని వస్తూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అభిమానులకు సంతోషాన్ని కలిగించేవారు. అయితే అదే అభిమానుల కోసం కళ్యాణ్ రామ్ ఓ పని చేయాలనుకున్నాడు. తన తమ్ముడు ఎన్టీఆర్, తండ్రి లతో కలిసి తాను కూడా నటించాలని ఆ సినిమాను తన బ్యానర్ లోనే నిర్మించాలని అనుకున్నారు. కళ్యాణ్ రామ్ చాలా కాలంగా తమ కాంబినేషన్ లో సినిమా చేయాలనుకుంటున్నారు.

ఓ సందర్భంలో ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు. కొందరు రచయితలకు విషయాన్ని చెప్పి కథను సిద్ధం చేయమని కూడా చెప్పాడట. కానీ ఇంతలోనే హరికృష్ణ మరణించడంతో కళ్యాణ్ రామ్ బాధకు అంతులేకుండా పోయింది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ల జీవితాల్లో తండ్రి లేని లోటుని ఎవరూ పూడ్చలేరు. 

ఇవి కూడా చదవండి.. 

హరికృష్ణ మృతిపై క్రిష్ ఎమోషనల్ పోస్ట్!

‘‘ఆ దేవుడు..పదేపదే మిమ్మల్నే ఏడిపిస్తున్నారు..’’