అఫైర్: నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్, షాకిచ్చిన లవర్

Subba Rao arrested for black mailing in   Hyderabad
Highlights

వివాహేతర సంబంధంతో వివాహితకు షాకిచ్చిన ప్రియుడు

హైదరాబాద్: వివాహితతో వివాహేతర సంబంధాన్ని
కొనసాగిస్తూ  ఆమె నగ్న వీడియోలను  భర్తకు
పంపిస్తామంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న
నిందితుడిని పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కు చెందిన వివాహిత దిల్‌షుక్
నగర్ పీఅండ్ టీ కాలనీలో నివాసం ఉంటుంది. భర్తతో పాటు
పిల్లలతో ఆమె అక్కడే నివాసం ఉంటుంది. 

అయిదు మాసాల క్రితం ఇందిరానగర్ కు చెందిన
సుబ్బారావు అనే వ్యక్తి ఫోన్ ‌లో ఆమెకు పరిచయమయ్యాడు.
ఈ పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి
దారితీసింది. 

అయితే వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి
సంబందించిన దృశ్యాలు సుబ్బారావు తన సెల్‌ఫోన్ ‌లో
వీడియోలు తీశాడు. వివాహితకు తెలియకుండానే ఈ
వీడియోలను రికార్డు చేశాడు. 

అయితే వివాహిత వద్ద నుండి సుబ్బారావు రూ. 2 లక్షలను
అప్పుగా తీసుకొన్నాడు. ఈ డబ్బులు ఇవ్వాలని వివాహిత
సుబ్బారావు ను అడిగింది.

అయితే మరోసారి తనను డబ్బులు ఇవ్వాలని అడిగితే  తమ
మధ్యఉన్న వివాహేతర సంబంధానికి సంబంధించిన
దృశ్యాలను భర్తకు పంపుతానని ఆమెను బెదిరించాడు.
అంతేకాదు ఈ దృశ్యాలు బయటకు రాకుండా ఉండాలంటే
మరో రూ.5 లక్షలు ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు  పోలీసులు  కేసు నమోదు
చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


 

loader