Saudi Road Accident : సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో హైదరబాదీ యాత్రికుల మరణం ఇరు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. తాజాగా తెలంగాణ మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దిన్ ఈ ఘటనపై స్పందించారు.
Saudi Road Accident : పవిత్రమైన మక్కా, మదీనా సందర్శ కోసం కుటుంబసమేతంగా సౌదీ అరేబియాకు వెళ్లిన భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు హైదరాబాదీలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. మక్కా నుండి మదీనాకు భారతీయ యాత్రికెలతో వెళుతున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది... దీంతో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుర్ఘటనపై ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తాజాగా రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దిన్ కుడా సౌదీ రోడ్డుప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ దుర్ఘటన గురించి తెలిసి షాక్ గురయ్యానని అన్నారు. ఈ ప్రమాదం హైదరబాదీ కుటుంబాల్లో విషాదం నింపడం మరింత బాధాకరమని అన్నారు.
ఈ ప్రమాదం గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగిన చర్యలు తీసుకుంటున్నారని... ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారని తెలిపారు. విదేశాంగ శాఖ, సౌదీలోని ఇండియన్ ఎంబసీలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించినట్లు మంత్రి అజారుద్దిన్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం సౌదీ అరేబియా బస్సు ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూం ఏర్పాటుచేసిందని మంత్రి తెలిపారు. 7997959754 లేదా 9912919545 నెంబర్లను ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, మైనారిటీ శాఖ అండగా ఉంటుందని... అన్నిరకాలు సహాయసహకారాలు అందిస్తాయని మంత్రి అజారుద్దిన్ తెలిపారు.
సౌదీ అరేబియా ప్రమాదంపై సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి
న్యూడిల్లీలోని తెలంగాణ భవన్ కంట్రోల్ రూం నెంబర్లు
వందన (రెసిడెంట్ కమీషనర్ పీఎస్) : ఫోన్ నెంబర్ 98719 99044
సీహెచ్. చక్రవర్తి (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) : ఫోన్ నెంబర్ 99583 22143
రక్షిత నైల్ (Liaison Officer): ఫోన్ నెంబర్ 96437 23157
సౌదీ అరేబియాలో ఇండియన్ ఎంబసి హెల్ప్ లైన్ నెంబర్
టోల్ ఫ్రీ నెంబర్ 8002440003
