MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • సౌదీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీల లిస్ట్ ఇదే

సౌదీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీల లిస్ట్ ఇదే

Saudi Arabia Road Accident : సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన 16 మంది మరణించారు. ఓ వ్యక్తి ప్రాణాలతో బైటపడ్డారు. మృతుల వివరాలిలా ఉన్నాయి. 

2 Min read
Arun Kumar P
Published : Nov 17 2025, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సౌదీ రోడ్డు ప్రమాదంలో 42మంది దుర్మరణం
Image Credit : x

సౌదీ రోడ్డు ప్రమాదంలో 42మంది దుర్మరణం

Saudi Bus Accident : విదేశాల్లో జరిగిన రోడ్డు ప్రమాదం హైదరాబాద్ లో విషాదాన్ని నింపింది. నగరంనుండి సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా వంటి పవిత్ర స్థలాల సందర్శనకు వెళ్లారు కొందరు యాత్రికులు. వీరంతా మక్కాను సందర్శించి మదీనాకు ఓ బస్సులో వెళుతుండగా ఘోరం జరిగింది. వేగంగా దూసుకెళుతున్న బస్సు ఓ డీజిల్ ట్యాంకర్ కు ఢీకొట్టింది... దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సులోని 42 మంది సజీవదహనం అయినట్లు తెలుస్తోంది.

25
సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన హైదరబాదీల లిస్ట్ ఇదే :
Image Credit : Generated by google gemini AI

సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన హైదరబాదీల లిస్ట్ ఇదే :

సౌదీ అరేబియాలో గత రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మొత్తం 42 చనిపోయారు... వీరిలో 16 మంది హైదరబాదీలు ఉన్నట్లు సమాచారం. వీళ్లంతా నగరంలోని మల్లేపల్లి బజార్ ఘాట్, అసిఫ్‌నగర్‌, జిర్రా, హబీబ్‌నగర్‌కు చెందినవారుగా తెలుస్తోంది.

1. రహీమున్నీసా

2. రహమత్‌ బీ

3. షెహనాజ్‌ బేగం

4. గౌసియా బేగం

5. కదీర్‌ మహ్మద్

6. మహ్మద్‌ మౌలానా

7. షోయబ్‌ మహ్మద్

8. సోహైల్‌ మహ్మద్

9. మస్తాన్‌ మహ్మద్

10. పర్వీన్‌ బేగం

11. జకియా బేగం

12. షౌకత్ బేగం

13. ఫర్హీన్‌ బేగం

14. జహీన్‌ బేగం,

15. మహ్మద్‌ మంజూర్

16. మహ్మద్‌ అలీ

Related Articles

Related image1
సౌదీ రోడ్డు ప్రమాదంలో హైదరబాదీలు మృతి ... వివరాల కోసం ఈ నెంబర్లకు కాల్ చేయండి
Related image2
మక్కా యాత్రలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 42 మంది మృతి, వీరిలో హైదరాబాదీలే ఎక్కువమంది
35
మృతులంతా రెండు కుటంబాలకు చెందినవారే..
Image Credit : X/Hyderabad

మృతులంతా రెండు కుటంబాలకు చెందినవారే..

ప్రమాదంలో చనిపోయిన హైదరబాదీలంతా కేవలం రెండు కుటుంబాలకు చెందినవారిగా తెలుస్తోంది. ఓ కుటుంబంలో 8మంది, మరో కుటుంబానికి చెందిన ఇంకో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంనుండి బస్సు డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలా బయటపడిన యువకుడు షోయబ్ గా గుర్తించారు.. అతడు కూడా హైదరాబాద్ కు చెందినవాడిగానే తెలుస్తోంది.

ఆల్‌ మక్కా ట్రావెల్స్‌ నుంచి 20 మంది, ఫ్లై జోన్‌ ట్రావెల్స్‌ నుంచి 24 మంది సౌదీ అరేబియా యాత్రకు బయలుదేరినట్లు సమాచారం. వీరంతా (42మంది) ఒకే బస్సులో మక్కా నుండి మదీనాకు వెళుతుండగా ప్రమాదం జరిగింది... డ్రైవర్ తో పాటు మరోవ్యక్తి ప్రాణాలతో బైటపడగా 42 మంది సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది.

45
సౌదీ అరేబియా ప్రమాదంపై సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి
Image Credit : Asianet News

సౌదీ అరేబియా ప్రమాదంపై సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

తెలంగాణ కంట్రోల్ రూం ఫోన్ నెంబర్లు

79979 59754

99129 19545

న్యూడిల్లీలోని తెలంగాణ భవన్ కంట్రోల్ రూం నెంబర్లు

వందన (రెసిడెంట్ కమీషనర్ పీఎస్) : ఫోన్ నెంబర్ 98719 99044

సీహెచ్. చక్రవర్తి (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) : ఫోన్ నెంబర్ 99583 22143

రక్షిత నైల్ (Liaison Officer): ఫోన్ నెంబర్ 96437 23157

55
తెలంగాణ ప్రభుత్వ సహాయక చర్యలు...
Image Credit : Asianet News

తెలంగాణ ప్రభుత్వ సహాయక చర్యలు...

సౌదీ రోడ్డు ప్రమాదంలో హైదరబాదీలు మరణించినట్లు తెలియగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే ప్రమాదంలో మరణించిన హైదరబాదీలు వివరాలు సేకరించాలని సీఎస్, డిజిపిని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.

ఇక ఈ ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలోని ఎన్నారై కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అక్కడి నేతలకు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
నేరాలు, మోసాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved