Asianet News TeluguAsianet News Telugu

అందమైన యువతులకు వల.. మేకప్ అకాడమీ కేంద్రంగా వ్యభిచారం.. నిర్వాహకుడిపై పీడీ యాక్ట్

హైదరాబాద్‌లో ఇద్దరు వ్యక్తులు సులువుగా డబ్బులు సంపాదించడానికి అందమైన యువతులకు వల వేసి వారిని వ్యభిచార కూపంలోకి లాగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. రైడ్‌లో దొరికిన మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు.
 

police raids on prostitution centre, manager arrested, pd act imposed in dilsukhnagar
Author
First Published Nov 24, 2022, 2:16 PM IST

హైదరాబాద్: డబ్బులు సులువుగా సంపాదించడానికి వారు అక్రమ మార్గంలో అడుగులు వేశారు. అందమైన యువతులకు వల వేసి వ్యభిచారంలోకి లాగారు. స్కిన్ మేకప్ అకాడమీలో వ్యభిచారాన్ని నిర్వహించారు. ఈ విషయం పోలీసులకు తెలియగానే వెంటనే తనిఖీలు చేసి నిర్వాహకులను పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్వాహకుడిపై సరూర్ నగర్ పోలీసులు పీడీ యాక్ట్ మోపారు. జైలుకు పంపించారు.

పోలీసుల వివరాల ప్రకారం, డబ్బులు సులువుగా సంపాదించడానికి 24 ఏళ్ల షేక్ అయాజ్, స్పా అండ్ సెలూన్ నిర్వాహకుడు బలరాం తప్పుదారి తొక్కారు. షేక్ అయాజ్ బండ్లగూడ నూరినగర్‌కు చెందిన నివాసి. బలరాం దిల్‌సుఖ్ నగర్‌లో స్పా అండ్ సెలూన్ నిర్వహిస్తున్నాడు. వీరిద్దరు డబ్బుల కోసం వ్యభిచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందమైన అమ్మాయిలకు వల వేయడం ప్రారంభించారు. వ్యభిచారాన్ని కూడా నిర్వహించడం స్టార్ట్ చేశారు.

Also Read: హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఓయో హోటల్‌లో గుట్టుగా! విదేశీ యువతి, వేరే రాష్ట్రాల యువతులకు విముక్తి

అందమైన యువతులను వల వేసి ప్రలోభ పెట్టి వారిని లలితానగర్‌లోని సిగ్నేచర్ స్టూడియో హెయిర్ అండ్ స్కిన్ మేకప్ అకాడమీకి తీసుకెళ్లేవారు. అక్కడే వారితో వ్యభిచారం చేయించారు. దీని గురించి తెలుసుకున్న పోలీసులు అక్టోబర్ 7వ తేదీన స్పా సెంటర్ పై రైడ్ చేశారు. షేక్ అయాజ్, బలరాంను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రెస్క్యూ హోంకు తరలించినట్టు తెలిసింది. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు షేక్ అయాజ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్లపల్లికి జైలుకు తరలించినట్టు సమాచారం అందింది.

Follow Us:
Download App:
  • android
  • ios