Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఓయో హోటల్‌లో గుట్టుగా! విదేశీ యువతి, వేరే రాష్ట్రాల యువతులకు విముక్తి

హైదరాబాద్‌లో ఓ ఓయో రూమ్‌లో గుట్టుగా సాగిస్తున్న వ్యభిచార వ్యవహారాన్ని యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ టీమ్ రట్టు చేసింది. ఆరుగురు  యువతులను రెస్క్యూ హోంకు తరలించగా.. సెక్స్ రాకెట్ నిర్వాహకులైన ముగ్గురిని గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
 

 

prostitution gang burst out in hyderabad, police arrest suspected functionaries
Author
First Published Nov 11, 2022, 6:03 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాజధాని నగరంలో మరోసారి వ్యభిచార కలకలం రేగింది. చాలా సార్లు పోలీసులు వ్యభిచారాన్ని నిర్విస్తున్న ముఠాలను పట్టుకుంటున్నారు. అరెస్టులు చేస్తున్నారు. బాధిత యువతులను రెస్క్యూ హోంలకు తరలిస్తున్నారు. కానీ, ఒక దాని తర్వాత మరొకటి, మరో చోట ఈ వ్యవభిచార వ్యవహారం పుట్టుకొస్తున్నట్టుగా ఇలాంటి ఆపరేషన్లు జరుగుతున్నాయి. తాజాగా, హైదరాబాద్‌లో ఓయో హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ టీమ్ రంగంలోకి దిగింది. స్పాట్‌కు వెళ్లి రైడ్ చేసి ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పించారు. కాగా, విదేశీ మహిళ సహా వేరే రాష్ట్రాలకు చెందిన ఆరుగురు యువతులకు ఈ వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ టీమ్ రైడ్ చేసినప్పుడు ఈ బాధితులంతా స్పాట్‌లో చిక్కారు.

గచ్చిబౌలి పోలీసులు ఈ ఘటన గురించి మాట్లాడారు. చిన్న అంజయ్యనగర్‌లో ఎంపైర్ ఓయో హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు సారథ్యంలో సైబరాబాద్ యాంంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ రంగంలోకి దిగింది. బుధవారం సాయంత్రం 6.30 గంటలకు అనుమానిత ప్రదేశంలో దాడి చేశారు. 

Also Read: లాడ్జిలో వ్యభిచార ముఠా.. ముగ్గురు యువతులతో పాటు, 12మంది అరెస్ట్..

ఈ రైడ్‌లో ఉజ్బెకిస్తాన్ యువతి సహా ఇద్దరు ఢిల్లీ యువతులు, ఇద్దరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతులు, మరొకరు ముంబయికి చెందిన యువతిని ఈ టీమ్ పట్టుకుంది. వారిని రెస్క్యూ హోంకు తరలించినట్టు తెలిసింది.

కాగా, జితేందర్ (35), పూణెకు చెందిన శ్రీకాంత్ (47), గచ్చిబౌలికి చెందిన యూ లక్ష్మయ్య (42)లను ఈ టీం అధుపులోకి తీసుకుంది. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు అప్పగించింది. కాగా, ఘటనాస్థలంలో 6 సెల్‌ఫోన్లు, 38 కండోమ్ ప్యాకెట్లు సహా రూ. 81,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. 

గచ్చిబౌలి పోలీసుల ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా వెలువడాల్సి ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios