యాదాద్రి ఆలయ రాతి స్తంభాలపై వివాదాస్పద చిహ్నాలను అధికారులు తొలగించారు. భారీ బందోబస్తు మధ్య ఆదివారం ఉదయం స్తంభాలపై చెక్కిన కేసీఆర్, నెహ్రూ, గాంధీ, కేసీఆర్ కిట్, హరితహారం, గుర్రం, సైకిల్, కారు, కమలం చిహ్నాలు, బొమ్మలను అధికారులు తొలగించారు.

యాదాద్రి ఆలయంలోని అష్టభుజి ప్రాకారంలో ఉన్న స్తంభాలపై కేసీఆర్, కారు ఇతర చిత్రాలు చెక్కడంపై తెలంగాణలో పెద్ద దుమారం రేగింది. అయితే ఇది శిల్పుల ఇష్టమని.. తాము ఉద్దేశ్యపూర్వకంగా చెక్కించలేదని ఆలయ అభివృద్ధి అధారిటీ స్పష్టం చేసింది.

కానీ ప్రస్తుత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేవి శిల్పాలని.. ఈ విషయంలో రాజకీయాల తగదని వివిధ రాజకీయ పక్షాలు విమర్శించాయి.  అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వ పెద్దలు వెనక్కి తగ్గారు.

ఆలయంలోని స్తంభాలపై కేసీఆర్‌తో పాటు ఎలాంటి రాజకీయ చిత్రాలు ఉండటానికి వీల్లేదని సీఎం ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతకు ముందు యాదాద్రి ఆలయ అభివృద్ధి కమిటీ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, మరికొందరితో భూపాల్ రెడ్డి ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.

ఆలయ ప్రాంగణంలో తన చిత్రం ఉండాలని కేసీఆర్ కోరుకున్నారని.. కేవలం దేవాలయ విశిష్టత, దైవ సంబంధిత అంశాలకు మాత్రం శిల్పుల ఇష్టానికే వదిలేసినట్లు భూపాల్‌రెడ్డి వారికి తెలిపారు. 

యాదాద్రి శిల్పాల వివాదంపై కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి ఆగ్రహం: తక్షణమే తొలగించాలని ఆదేశం

యాదాద్రి టెంపుల్ వద్ద ఉద్రిక్తత: బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను అడ్డుకున్న పోలీసులు, లాఠీఛార్జ్

యాదాద్రి వివాదం: కేసీఆర్ కృష్ణదేవరాయలా, మోనార్కా?

కేసీఆర్ చిత్రాలు: యాదాద్రిలో రాజాసింగ్ హల్ చల్, ప్రభుత్వానికి అల్టిమేటమ్

యాదాద్రిపై కేసీఆర్ సారు శిల్పాలు (ఫొటోలు)

ఆయనకు దేవుడు, యాదాద్రిపై అందుకే కేసీఆర్ బొమ్మ చెక్కాడు: కిషన్ రావు

యాదాద్రి శిల్పాలపై అధికారుల వివరణ: భావి తరాల కోసమే కేసీఆర్, కారు చిత్రాలు, రాజకీయ ఉద్దేశం లేదు

యాదాద్రి శిల్పాలపై కేసీఆర్ బొమ్మలు