యాదాద్రి శిల్పాలపై అధికారుల వివరణ: భావి తరాల కోసమే కేసీఆర్, కారు చిత్రాలు, రాజకీయ ఉద్దేశం లేదు

దేవాయలం ఒక చరిత్రను తెలియజేస్తుందని తెలిపారు. ఆయా కాలంలో ఉండేటువంటి సాంస్కృతి, ప్రత్యేక పరిస్థితులను గుర్తు చేస్తూ శిల్పులు ఆయా దేవాలయాల్లో చెక్కడం సహజంగా జరుగుతుందని తెలిపారు. అహోబిలంలో మహాత్మగాంధీజి, నెహ్రూ చిత్రాలు ఉన్నాయని అలాగే యాదాద్రి శిలలపై కూడా కారు, కేసీఆర్ బొమ్మలు ఉన్నాయన్నారు.  
 
yadadri special officer kishan rao gives clarity about kcr, car carvings at yadadri temple

యాదాద్రి: యాదాద్రిలో దేవాలయంలో శిల్పాల వివాదంపై వివరణ ఇచ్చారు యాదాద్రి ప్రత్యేక అధికారి కిషన్ రావు. యాదాద్రిలో దేవాలయంలో శిలలపై రాజకీయ ప్రతిమలు చెక్కారా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు తెలిపారు. శిలలపై ఈ చిత్రాలను చెక్కాలని తాము ఏ శిల్పికి చెప్పలేదని  స్పష్టం చేశారు. రాజకీయాలకు సంబంధించి శిల్పాలు చిత్రీకరించారా అన్న దానిపై వివరణ చేపట్టినట్లు తెలిపారు. 

దేవాయలం ఒక చరిత్రను తెలియజేస్తుందని తెలిపారు. ఆయా కాలంలో ఉండేటువంటి సాంస్కృతి, ప్రత్యేక పరిస్థితులను గుర్తు చేస్తూ శిల్పులు ఆయా దేవాలయాల్లో చెక్కడం సహజంగా జరుగుతుందని తెలిపారు. అహోబిలంలో మహాత్మగాంధీజి, నెహ్రూ చిత్రాలు ఉన్నాయని అలాగే యాదాద్రి శిలలపై కూడా కారు, కేసీఆర్ బొమ్మలు ఉన్నాయన్నారు.  

యాదాద్రి ఆలయంలో అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కామని అందులో భాగంగానే కారు గుర్తును చెక్కినట్లు తెలిపారు. ఇకపోతే కేసీఆర్ చిత్రాన్ని చెక్కడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. 

యాదాద్రి టెంపుల్ లో శిల్పాలు చెక్కడంతో ఎందరో శిల్పుల కుటుంబాలు కేసీఆర్ చూపించిన ఉపాధిపై బతికారని వారిని దేవుడిగా కొలిచే చిత్రాలు చెక్కారని తెలిపారు. సాంఘీక సంస్కరణలో భాగంగా కేసీఆర్ చిత్రాన్ని చెక్కించారే తప్ప ఏ రాజకీయ ఉద్దేశాలకు సంబంధించినది కాదన్నారు. 

ఏ వ్యక్తి కోసమో తాము కేసీఆర్ చిత్రాలను చెక్కలేదన్నారు. రాబోవు తరాల వారికి ఈ సమకాలిక పరిస్థితులను తెలిపే భాగంలో కారణంగానే కేసీఆర్ చిత్రాలను చెక్కినట్లు ప్రత్యేక అధికారి కిషన్ రావు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios