హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్థూపాలపై తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు సింబల్స్ చెక్కడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎవరి ఆదేశం మేరకు ఈ పని చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రాంగణంలో తన బొమ్మ ఉండాలని సీఎం కేసీఆర్ కూడా కోరుకోరని స్పష్టం చేశారు. దైవ సంబంధ అంశాలే ఉండాలని సీఎం ఆకాంక్షించారని చెప్పుకొచ్చారు.

యాదాద్రి ఆలయంలో దైవ సంబంధిత చిహ్నాలే ఉండాలని ఆదేశించారు. నాయకులు, పార్టీల చిహ్నాలు ఉండటానికి వీళ్లేదని హెచ్చరించారు. కేసీఆర్, ఇందిర, గాంధీ విగ్రహాలతోపాటు పార్టీ చిహ్నాలు ఎందుకు చెక్కారంటూ నిలదీశారు. ఎవరి ఆదేశం మేరకు ఈ పని చేశారో చెప్పాలని నిలదీశారు. 

ప్రాంగణంలో తన బొమ్మ ఉండాలని సీఎం కేసీఆర్ కూడా కోరుకోరని స్పష్టం చేశారు. దైవ సంబంధ అంశాలే ఉండాలని సీఎం ఆకాంక్షించారని చెప్పుకొచ్చారు. తక్షణమే నాయకుల బొమ్మలు, పార్టీల చిహ్నాలు తొలగించాలని భూపాల్ రెడ్డి వైటీడీఏ అధికారులను ఆదేశించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

యాదాద్రి టెంపుల్ వద్ద ఉద్రిక్తత: బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను అడ్డుకున్న పోలీసులు, లాఠీఛార్జ్