Asianet News TeluguAsianet News Telugu

జగన్‌పై దాడి... ఎంపి కవిత ఏమన్నారంటే...

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని ఖండించారు నిజామాబాద్ ఎంపి కవిత. ట్విట్టర్ ద్వారా స్పందించిన కవిత ఈ  దాడిపట్ల విచారం  వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిని ఓ పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించారు.  ఇలాంటి హింసా సంస్కృతిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని కవిత వెల్లడించారు. 

nizamabad mp kavitha responds on jagan attack
Author
Hyderabad, First Published Oct 25, 2018, 4:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని ఖండించారు నిజామాబాద్ ఎంపి కవిత. ట్విట్టర్ ద్వారా స్పందించిన కవిత ఈ  దాడిపట్ల విచారం  వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిని ఓ పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించారు.  ఇలాంటి హింసా సంస్కృతిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని కవిత వెల్లడించారు. 

ఇలాంటి  ఘటనలు దేశ సమగ్రతను నాశనం చేస్తాయని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలోపేతమైన భద్రతా చర్యలు తీసుకోవాలని  కవిత సూచించారు.  

 వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డిపై వైజాగ్ విమానాశ్రయంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ కు బయలుదేరడానికి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా అక్కడే  ఓ హోటల్లో పనిచేసే శ్రీనివాసరావు అనే దుండగుడు కత్తితో దాడిచేసి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని పలువురు నాయకులు పార్టీలకతీతంగా ఇప్పటికే ఖండించారు.

మరిన్ని వార్తలు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios