మా బావ హరీష్‌రావు లక్ష మెజారిటీ వచ్చేలా  ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్  సిద్దిపేట ప్రాంత ప్రజలను కోరారు. 


సిద్దిపేట: మా బావ హరీష్‌రావు లక్ష మెజారిటీ వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిద్దిపేట ప్రాంత ప్రజలను కోరారు. సిద్దిపేట మీదుగా హైద్రాబాద్ వస్తున్న తరుణంలో హరీష్‌రావును గెలిపించాలని కోరారు. ఈ మేరకు కేటీఆర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి తిరుగు ప్రయాణంలో సిద్దిపేట నియోజకవర్గంలోని పొన్నాల వద్ద దాబా వద్ద కేటీఆర్ ఆగారు. టీ ఆర్డర్ చేశారు. కేటీఆర్ టీ ఆర్డర్ చేయగానే ఆయనను గుర్తించిన స్థానికులు వెంటనే ఆయన వద్దకు చేరుకొని సెల్పీలు తీసుకొన్నారు.

స్థానికంగా ఉన్న పరిస్థితుల గురించి చర్చించారు. అందరితో మాట్లాడి కేటీఆర్ బయలుదేరే ముందు మా బావ హరీష్ రావు లక్ష ఓట్ల మెజారిటీ దాటేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం తమ వంతు ప్రయత్నాలు చేయాల్సిందిగా కోరారు. కేటీఆర్ స్థానికులతో మాట్లాడిన మాటలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారాయి.

సంబంధిత వార్తలు

రాజకీయ సన్యాసం చేస్తా:కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన కోమటిరెడ్డి

కారు డ్రైవర్ కేసీఆరే: సీఎం పదవిపై కేటీఆర్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌‌పై బాబు కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్

హైద్రాబాద్ అభివృద్ధి నాదే, కేసీఆర్‌కు ఆ సత్తా లేదు: బాబు

కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ఎస్‌లో చేరనున్న చెరుకు ముత్యం రెడ్డి

ఆ ఆరుగురు ఎవరో: కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదలలో ఉత్కంఠ

రాజకీయ సన్యాసం చేస్తా:కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన కోమటిరెడ్డి

కారు డ్రైవర్ కేసీఆరే: సీఎం పదవిపై కేటీఆర్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌‌పై బాబు కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్

హైద్రాబాద్ అభివృద్ధి నాదే, కేసీఆర్‌కు ఆ సత్తా లేదు: బాబు

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి