Asianet News TeluguAsianet News Telugu

లవ్ మ్యారేజ్ తప్పా, నాన్నను క్షమించను: మాధవి(వీడియో)

 తన తండ్రిని క్షమించనని మాధవి చెప్పారు. చావైనా బతుకైనా తన భర్త సందీప్‌తోనే అని మాధవి స్పష్టం చేశారు.
 

love marriage:  Madhavi discharged from hospital
Author
Hyderabad, First Published Oct 17, 2018, 9:33 PM IST

హైదరాబాద్: తన తండ్రిని క్షమించనని మాధవి చెప్పారు. చావైనా బతుకైనా తన భర్త సందీప్‌తోనే అని మాధవి స్పష్టం చేశారు.

తండ్రి చేతిలో దాడికి గురైన మాధవి బుధవారం రాత్రి పూట యశోదా ఆసుపత్రి నుండి డిశ్చార్చి అయింది. 22 రోజుల పాటు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న మాధవి వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది.

బట్టలు ఇప్పిస్తానని చెప్పి తన కూతురు మాధవి, అల్లుడు సందీప్ ను రప్పించి హైద్రాబాద్ గోకుల్ థియేటర్ సమీపంలో వారిపై మనోహరాచారి దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన సెప్టెంబర్ 19వ తేదీన జరిగింది. 

మనోహరాచారి దాడిలో  మాధవి తీవ్ర గాయాలతో యశోదా ఆసుపత్రిలో చేరింది. వైద్యులు సకాలంలో చికిత్స అందించారు. నాలుగైదు శస్ర్తచికిత్సలు చేసి ఆమె ప్రాణాలను కాపాడారు.

ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత మాధవి మీడియాతో మాట్లాడారు. తాను తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లబోనని మాధవి ప్రకటించారు. చావైనా బతుకైనా సందీప్ తోనే ఉంటానని తేల్చి చెప్పింది.

అంతేకాదు తన తండ్రిని ఏనాటికీ కూడ క్షమించనని ప్రకటించింది. ఎవరికీ తన లాంటి కష్టం రాకూడదని తాను కోరుకొంటున్నట్టు ఆమె తెలిపారు. తాను ఆసుపత్రిలో నరకం అనుభవించానన్నారు.

తనను సందీప్ మంచిగా చూసుకొంటారని నమ్మకం ఉందన్నారు. అందుకే తాను సందీప్ ను పెళ్లి చేసుకొన్నానని గుర్తు చేసుకొన్నారు. ప్రేమ పెళ్లి చేసుకోవడం తప్పు ఎలా అవుతోందని ఆమె ప్రశ్నించారు.

 

"

10వ, తరగతి నుండి సందీప్, మాధవిలు ప్రేమించుకొంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలిసి ఇద్దరిని మందలించారు. కానీ వీరిద్దరూ మాత్రం కలుసుకోవడం మానలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో పెళ్లి చేసుకొన్నారు.

సందీప్ ఎస్సీ సామాజికవర్గానికి చెందినవాడు. మాధవిది బీసీ సామాజిక వర్గం.కుటుంబసభ్యులకు తెలియకుండానే ఆర్యసమాజ్ లో మాధవి, సందీప్ 2018 సెప్టెంబర్ మాసంలో వివాహం చేసుకొన్నారు. అయితే ఈ పెళ్లి నచ్చని తండ్రి మనోహరాచారి సందీప్, మాధవిని గోకుల్ థియేటర్ వద్దకు పిలిపించి దాడి చేశాడు.

సంబంధిత వార్తలు

తండ్రి దాడి: ఆసుపత్రి నుండి డిశ్చార్జి కానున్న మాధవి

ఎస్ఆర్ నగర్ దాడి: మాధవి తండ్రిని వెనక నుంచి తన్నిందెవరో తెలుసా...

భార్యకు చివరి కాల్: అదే మనోహరాచారిని పట్టిచ్చింది

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios