Asianet News TeluguAsianet News Telugu

తండ్రి దాడి: ఆసుపత్రి నుండి డిశ్చార్జి కానున్న మాధవి

తండ్రి చేతిలో  దాడికి గురైన మాధవి బుధవారం నాడు ఆసుపత్రి నుండి డిశ్చార్జి కానుంది. 

Madhavi ready to discharge from hospital
Author
Hyderabad, First Published Oct 17, 2018, 5:16 PM IST

హైదరాబాద్: తండ్రి చేతిలో  దాడికి గురైన మాధవి బుధవారం నాడు ఆసుపత్రి నుండి డిశ్చార్జి కానుంది. తక్కువ కులానికి చెందిన వాడిని పెళ్లి చేసుకొందనే కోపంతో మాధవితో పాటు ఆమె భర్త సందీప్‌ పై తండ్రి మనోహరాచారి దాడి చేసిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 19వ తేదీన హైద్రాబాద్ గోకుల్ థియేటర్ వద్ద మనోహరాచారి  తన కూతురు మాధవి, అల్లుడు సందీప్‌పై దాడికి పాల్పడ్డారు.  ఈ దాడిలో సందీప్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.

కానీ తీవ్ర  గాయాలతో యశోదా  ఆసుపత్రిలో 22 రోజులుగా మాధవి చికిత్స పొందుతోంది. సకాలంలో మాధవిని ఆసుపత్రికి చేర్చడంతో  వైద్యులు  చికిత్స చేశారు.  దీంతో మాధవి పూర్తిగా కోలుకొంది. 

బుధవారం నాడు మాధవిని ఆసుపత్రి నుండి  డిశ్చార్జి చేయనున్నారు.యశోదా ఆసుపత్రిలో  మాధవి వైద్యం కోసం సుమారు. 9 లక్షలకు పైగా ఖర్చు అయినట్టుగా సమాచారం. అయితే ఈ ఆసుపత్రి ఖర్చును ప్రభుత్వం భరించాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

 

సంబంధిత వార్తలు

ఎస్ఆర్ నగర్ దాడి: మాధవి తండ్రిని వెనక నుంచి తన్నిందెవరో తెలుసా...

భార్యకు చివరి కాల్: అదే మనోహరాచారిని పట్టిచ్చింది

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

Follow Us:
Download App:
  • android
  • ios