హైదరాబాద్: హైదరాబాదులోని ఎర్రగడ్డలో కూతురు మాధవిపై దాడి చేస్తుండగా మనోహరాచారిని వెనక నుంచి ఓ యువకుడు ఎగిరి తన్నిన దృశ్యాన్ని చాలా మంది వీడియోలో చూసే ఉంటారు. అతను ఎవరనే ఆసక్తి కూడా సర్వత్రా నెలకొంది. ఆ యువకుడిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. 

పరోక్షంగా అతను మాధవిని కాపాడడంటూ నెటిజన్లు ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నారు. మనోహరాచారిని ఎగిరి తన్నిన దృశ్యాన్ని అతని ఫొటోకు జోడించి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. అతని పేరు అసద్ అని గుర్తించారు. 

ఎదుటి వ్యక్తి చేతిలో కత్తి చూసి కూడా కాపాడాలని దూకావు చూడూ అది మనిషితనం, లవ్ యూ అసద్ అంటూ వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అతని ఫొటోతో పోస్టు పెట్టాడు. అది వైరల్ మారింది.

కులం కుళ్లు, మతం మత్తు దాటి మానవత్వం చాటిన అసద్.. జయహో.. అంటూ పివోడబ్ల్యూ నాయకురాలు సంధ్య ప్రశంసించారు. అసద్ గ్రేట్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రియల్ హీరోగా కూడా అభివర్ణించారు. ఆ పోస్టును నెటిజన్లు షేర్ చేస్తున్నారు. పెద్ద యెత్తున లైక్ చేస్తున్నారు.  

                  "

సంబంధిత వార్తలు

భార్యకు చివరి కాల్: అదే మనోహరాచారిని పట్టిచ్చింది

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన