హైదరాబాద్: టీఆర్ఎస్‌లో ఓ వర్గం తనను టార్గెట్ చేసిందని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చెప్పారు. వినాయకచవితి తర్వాత ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని ఆమె ప్రకటించారు.

బుధవారం నాడు ఆమె  మీడియాతో మాట్లాడారు.  ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంతో పాటు తనను తీవ్రంగా అవమానపర్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ లో ఓ వర్గం తనను దెబ్బతీసే లక్ష్యంతో పనిచేశారని ఆమె చెప్పారు.

కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్లున్నాడని ఆమె చెప్పారు.  ఒకవేళ టీఆర్ఎస్ కు మెజారీటీ వస్తే పార్లమెంట్ ఎన్నికల వరకు కేసీఆర్ సీఎంగా ఉంటారని... పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కేటీఆర్ కు బాధ్యతలను అప్పగించి  పార్లమెంట్ కు వెళ్లిపోతాడనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.

టిక్కెట్టు కేటాయించకుండా ఎందుకు నిలిపివేశారనే దానిపై స్పష్టత ఇవ్వకుండా అవమానపర్చారని ఆమె ఆవేదన చెందారు.  ఎందకు టిక్కెట్టు ఇవ్వడం లేదనే విషయాన్ని చెబుతారనే తాను మూడు రోజుల పాటు  ఎదురుచూసినా   కానీ తనకు స్పష్టమైన  సమాచారం ఇవ్వలేదన్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను పార్టీకి వ్యతిరేకంగా  తాను లేఖను విడుదల చేసినట్టు ఆమె చెప్పారు. కొన్ని సమయాల్లో కొన్ని చోట్ల  కేటీఆర్ తో విబేధాలు వచ్చినట్టు ఆమె చెప్పారు. కేటీఆర్ చుట్టూ ఓ కోటరి ఉంటుందన్నారు.ఆ కోటరీ మాటలను వినడమే కేటీఆర్ చేస్తుంటారని ఆమె విమర్శించారు. 

ఈ విషయమై తాను కేటీఆర్ ను ప్రశ్నించినట్టు  చెప్పారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకే తనకు టిక్కెట్టు కేటాయించకుండా  ఆపారనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చే్స్తున్నారు.తాను అహంకారంగా ఉంటే నాలుగు దఫాలు ఎలా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబసభ్యు అహంకారాన్ని ప్రశ్నించినందుకే  తనకు టిక్కెట్టు ఇవ్వకుండా  తాను అహంకారినని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్పారు.

2014 ఎన్నికలకు ముందు  పరకాల నుండి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగాలని తాను ప్లాన్ చేసుకొంటున్న సమయంలో  మూడు మాసాలుగా  తమతో  కేసీఆర్ రాయబారాన్ని నడిపించారని ఆమె గుర్తు చేసుకొన్నారు.  అయితే  మూడు మాసాల తర్వాత టీఆర్ఎస్ నుండి ఒత్తిడి పెరగడంతో కేసీఆర్ ను కలిసినట్టు చెప్పారు. అయితే పరకాల నుండి కాకుండా  వరంగల్ ఈస్ట్ నుండి పోటీ చేయాలని కేసీఆర్ ఆనాడు తమ ముందు ప్రతిపాదన పెడితే  తాము ఇబ్బందిపడినట్టు చెప్పారు.

మంత్రి బస్వరాజు సారయ్యను ఓడించేందుకు ఈస్ట్ నుండి పోటీ చేయాలని పట్టుబట్టీ  తమ పార్టీ అవసరాల కోసం తమను టీఆర్ఎస్‌లో చేర్చుకొన్నారని కొండా సురేఖ చెప్పారు.తనకు వరంగల్ ఈస్ట్ తో పాటు మురళికి ఎమ్మెల్సీని ఇస్తామన్నారు. అంతేకాదు తనకు మంత్రి పదవిని కూడ ఇస్తామని కూడ హమీ ఇచ్చారని ఆమె చెప్పారు.టీఆర్ఎస్ కారణంగా తనకు రాజకీయ బిక్ష టీఆర్ఎస్ పెట్టలేదన్నారు.  ఆ పార్టీ అవసరాల కోసమే తమను వాడుకొన్నారని ఆమె కుండబద్దలు కొట్టారు.

నల్లాల ఓదేలు, బొడిగె శోభ. బాబు మోహన్‌కు ఎందుకు టిక్కెట్లు ఇవ్వలేదో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. అబద్దాలు చెప్పడం సరైంది కాదని  కొండా సురేఖ చెప్పారు.
కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే మంత్రులుగా కేటీఆర్ కు  గట్టిగా ఢీకొట్టే వారిని మంత్రివర్గంలో లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే తనకు టిక్కెట్టు ఇవ్వలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

కేటీఆర్ కు, హరీష్ రావుకు సంతోష్ కు ఫోన్ చేశాను. కానీ వారు ఫోన్లు లిఫ్ట్ చేయలేదని చెప్పారు. కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేయలేదని చెప్పారు.  ఈ కారణంగానే తాను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టు చెప్పారు.

బహిరంగ లేఖ రిలీజ్ చేయాలని భావించినట్టు చెప్పారు. కొండగట్టు ప్రమాదం కారణంగా  బహిరంగ లేఖ రిలీజ్  చేస్తామన్నారు.  నాలుగున్న ఏళ్లలో జరిగిన  ఘటనలను ఈ లేఖలను ప్రస్తావిస్తామన్నారు.

రెండు మూడు టిక్కెట్లు ఇవ్వాలని  అడగలేదు.. వరంగల్ ఈస్ట్  గురించి అడిగాను.. కానీ, టిక్కెట్టు అడగలేదు.  పార్టీలో కూడ ఈ విషయమై ఏనాడు చర్చించలేదు.  పార్టీ గతంలో తనకు మంత్రి పదవిని ఇస్తామని ఇచ్చిన హామీని  అమలు చేయనప్పుడు కూడ అడగలేదన్నారు. రెండు మూడు టిక్కెట్ల గురించి తాను ఏనాడూ అడగలేదన్నారు.

టీఆర్ఎస్‌లో ఏనాడూ కూడ మాట్లాడే స్వాతంత్ర్యం లేదన్నారు.  అందరిలో కూడ అసంతృప్తి ఉందన్నారు.  తమకు 100 సీట్లు వస్తాయనే భావన  టీఆర్ఎస్ నాయకత్వంలో ఉందన్నారు.  తనలాంటి వాళ్లను  వదులుకొంటే నష్టమేంటో త్వరలోనే తెలుస్తోందన్నారు. టీఆర్ఎస్ కు 50 నుండి 60సీట్ల కంటే రావు. విపక్షాలు మూకుమ్మడిగా పోటీ చేస్తే  టీఆర్ఎస్ విజయావకాశాలు దెబ్బతింటాయన్నారు.

అన్ని పార్టీల నుండి  ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. వినాయకచవితి తర్వాత తమ నిర్ణయాన్ని  ప్రకటిస్తామని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడ కేసీఆర్ కు చెప్పే పరిస్థితి టీఆర్ఎస్ లో ఉండదన్నారు. విమర్శలు కేసీఆర్ కు చెప్పే ధైర్యం ఏ నేతకు లేదన్నారు.


ఈ వార్తలు చదవండి

14 పెండింగ్ స్థానాలపై కేసిఆర్ వ్యూహం ఇదే..

ముహూర్తం ఖరారు: కాంగ్రెస్‌లోకి డీఎస్, కొండా సురేఖ

ఉప్పల్ కాంగ్రెస్‌లో చిచ్చు: అనుచరులతో రాజిరెడ్డి భేటీ, టీఆర్‌ఎస్‌లోకి

కార్యకర్తలతో భేటీ: 23 వరకు కొండా సురేఖ వెయిట్

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

బీసీ మహిళను అవమానించారు, కన్నీళ్లు పెట్టుకున్నా: కొండా సురేఖ

కొండా సురేఖ టిక్కెట్టుపై వీడని సస్పెన్స్, ఎందుకంటే?