హైదరాబాద్‌: పరకాల సీటును వదిలిపెట్టి వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేయాలని కేసిఆర్ అడిగినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానని, సొంత నియోజకవర్గం పరకాల వదులుకోవాల్సి వచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్నానని కొండా సురేఖ అన్నారు.

తాను పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సిద్ధపడిన సమయంలో కేసిఆర్ తనను పిలిపించారని, తనకు పరకాల టికెట్ ఇస్తే పార్టీలోకి వస్తానని చెప్పానని, అయితే చివరకు కేసిఆర్ ఒక్కసారి మాట్లాడుదామంటే కలిశానని ఆమె చెప్పారు.

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బస్వరాజు సారయ్యను మీరు తప్ప మరొకరు ఓడించలేరని చెప్పి తనను వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేయించారని, మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. పరకాల సీటు వదిలిపెట్టాల్సి వచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్నానని ఆమె అన్నారు. 

తన భర్త కొండా మురళితో కలిసి ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. 

కేసిఆర్ 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి తన పేరును పెండింగులో పెట్టడం బాధ కలిగించిందని కొండా సురేఖ చెప్పారు. నాలుగేళ్లలో తాము చేసిన తప్పేమీ లేదని ఆమె అన్నారు. ప్రభుత్వానికి గానీ పార్టీకి గానీ వ్యతిరేకంగా పనిచేయలేదని ఆయన అన్నారు.  

వరంగల్ లోని 12 స్థానాల్లో 11 మంది జాబితాను ప్రకటించి, తన పేరు ప్రకటించకపోవడంపై కారణం తెలియక మీడియా ద్వారా అడగడానికి వచ్చానని ఆమె అన్నారు.  తన పేరును పక్కన పెట్టడాన్ని బీసీలను, తెలంగాణ మహిళలను అవమానించినట్లుగా భావిస్తున్నానని ఆమె అన్నారు. 

తాము ఏ పార్టీ జెండా పట్టుకున్నా ఎందుకు పార్టీ మారారని తమ అనుచరులు అడగబోరని, తమ వెంట ఉంటారని ఆమె అన్నారు. తమ పేరు తొలి జాబితాలో ఎందుకు లేదో సమాధానం చెప్పాలని ఆమె టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడిగారు. సమాధానం వచ్చిన తర్వాత ఏం చేయాలో తాము నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు.

రెండు మూడు రోజుల్లో బహిరంగ లేఖ రాసి, ఏ పార్టీలో చేరుతామనో చెబుతామని అన్నారు. బొడిగె శోభ రికార్డు బాగుందని కేసిఆర్ నెత్తి మీద చేయి పెట్టి చెప్పారని, ఆమెకు టికెట్ నిరాకరించారని ఆమె అన్నారు. ఎస్సీలైన బాబూ మోహన్, ఓదేలులకు టికెట్లు నిరాకరించారని, బీసీలకూ ఎస్సీలకే అన్యాయం చేస్తున్నారని ఆమె అన్నారు. 

తాము చేసిన తప్పేమిటో టీఆర్ఎస్ నాయకత్వం చెప్పాలని ఆమె అన్నారు. తమను పక్కన పెట్టడం వల్ల తమ ఆత్మాభిమానం దెబ్బ తిన్నదని, అందువల్ల మాట్లాడాల్సి వచ్చిందని ఆమె అన్నారు. వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేసినప్పుడు పార్టీ నుంచి ఒక్క పైసా తీసుకోలేదని ఆమె చెప్పారు. 

మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించని ఘతన టీఆర్ఎస్ దేనని ఆమె అన్నారు. హామీ ఇచ్చి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే అడగలేదని, గతంలోనే తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టానని ఆమె అన్నారు. ఎంపీ ఉప ఎన్నికలో తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నామని, కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా తాము పార్టీ నుంచి డబ్బులు తీసుకోలేదని అన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా పోటి చేసినప్పుడు కూడా పార్టీ నుంచి డబ్బులు తీసుకోకుండా పనిచేశామని ఆమె అన్నారు. 

ఎవరి ప్రభావంతో తనకు టికెట్ ఆపారో చెప్పాలని ఆమె అడిగారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి హామీలు ఇచ్చారని, అటువంటివారికి ఎవరికీ న్యాయం జరగలేదని, వలసలు వచ్చినవారు ఆలోచించాల్సిన సమయం ఇదేనని ఆమె అన్నారు. 

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

బీసీ మహిళను అవమానించారు, కన్నీళ్లు పెట్టుకున్నా: కొండా సురేఖ

అక్రమ సంబంధానికి గోత్రాలతో పనేంటి..కేసీఆర్ పై లోకేష్ సెటైర్