Asianet News TeluguAsianet News Telugu

కొండా సురేఖ టిక్కెట్టుపై వీడని సస్పెన్స్, ఎందుకంటే?

తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు ప్రకటించిన  105 మంది అభ్యర్థుల జాబితాలో  వరంగల్ ఈస్ట్ సీటులో మాజీ మంత్రి కొండా సురేఖ విషయంలో పెండింగ్ లో పెట్టారు.

why kcr not announced konda surekha name in first list
Author
hyderabad, First Published Sep 6, 2018, 5:28 PM IST


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు ప్రకటించిన  105 మంది అభ్యర్థుల జాబితాలో  వరంగల్ ఈస్ట్ సీటులో మాజీ మంత్రి కొండా సురేఖ విషయంలో పెండింగ్ లో పెట్టారు.కొండా దంపతులు కనీసం రెండు టిక్కెట్లను  అడుగుతున్నారు.సిట్టింగ్ స్థానం వరంగల్ ఈస్ట్  నుండి  మరోసారి  టిక్కెట్టు కేటాయించే విషయంలో కేసీఆర్ సస్పెన్స్ పెట్టారు.

2014 ఎన్నికల ముందు  కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్ లో చేరారు.  చివరి నిమిషంలో  వరంగల్ ఈస్ట్ నుండి కొండా సురేఖ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి  విజయం సాధించారు.

అయితే  ఒకానొక దశలో కొండా సురేఖను మంత్రివర్గంలోకి తీసుకొంటారని కూడ ప్రచారం సాగింది. కానీ చివరి నిమిషంలో ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. 
టిక్కెట్లు దక్కవని  భావించిన వారికి కూడ  టీఆర్ఎస్ జాబితాలో చోటు దక్కింది. 

తెలంగాణ రాష్ట్రంలో 105 మంది అభ్యర్థుల జాబితాను   గురువారం నాడు ప్రకటించారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు  కేసీఆర్ టిక్కెట్లను నిరాకరించారు. మేడ్చల్,. మల్కాజిగిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు  జాబితాలో చోటు దక్కలేదు. వరంగల్ ఈస్ట్ నుండి కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తొలి జాబితాలో ఆమె పేరును ప్రకటించలేదు.

స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగా పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ప్రకటించే జాబితాలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం పేరును చేర్చారు.  కొండా దంపతులు  రెండు టిక్కెట్లను కోరుతున్నట్టుగా కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.

స్పీకర్ మధుసూధనాచారి ప్రాతినిథ్యం వహిస్తున్న భూపాలపల్లితో పాటు  వరంగల్ ఈస్ట్ ను కూడ కోరుతున్నారని  కొంతకాలంగా  ప్రచారం సాగుతోంది. అయితే  భూపాల‌పల్లి నుండి  మరోసారి స్పీకర్‌ మధుసూధనాచారికే కేసీఆర్ టిక్కెట్టు ఇచ్చారు.

అయితే భూపాలపల్లి టిక్కెట్టు దక్కితే  కొండా సురేఖ తన కూతురును బరిలోకి దింపాలని భావించారు.  అయితే  భూపాలపల్లి టిక్కెట్టు మాత్రం స్పీకర్ కు కేటాయించారు. మరోవైపు  వరంగల్ ఈస్ట్ సీటు విషయంలో కూడ వరంగల్ మేయర్ నరేందర్ రావు వర్గీయులతో కూడ కొండా దంపతులకు స్థానికంగా ఇబ్బందులు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.

కొండా సురేఖకు వరంగల్ తూర్పులో  టిక్కెట్టు కేటాయించకుండా  నరేందర్ రావు  వర్గీయులు అడ్డుకొంటున్నారని  ప్రచారం సాగుతోంది. ఈ కారణాల నేపథ్యంలోనే వరంగల్ ఈస్ట్ సీటును  కొండా సురేఖ పేరును  ప్రకటించలేదనే ప్రచారం సాగుతోంది.

ఈ సీటు విషయంలో స్థానికంగా పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలపై చర్చించిన తర్వాత కేసీఆర్ టిక్కెట్లను ప్రకటించే అవకాశం లేకపోలేదు. అయితే తొలి జాబితాలో పేరు లేకపోవడంపై  కొండా దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఈ వార్తలు చదవండి

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?

స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

సిట్టింగ్ సీటు కోల్పోయిన మాజీ జర్నలిస్ట్: ఆంథోల్ లో క్రాంతికి సీటు

అసెంబ్లీ రద్దు: అపద్ధర్మ సీఎంల అధికారాలివే

అసెంబ్లీ రద్దు: గుజరాత్ తీర్పు ఏం చెబుతోంది?

Follow Us:
Download App:
  • android
  • ios