Asianet News TeluguAsianet News Telugu

తీవ్ర నిరాశ, అసంతృప్తి: అమ్మకానికి కేసీఆర్ గుడి !..

కేసీఆర్ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు కూడా చేస్తున్నాడు. అంతలా అభిమానం చాటుకున్న తనకు కెసిఆర్, కేటీఆర్ లను కలిసే అవకాశం కూడా రావడంలేదని,  టిఆర్ఎస్ పార్టీలో గుర్తింపు దక్కలేదని నిరాశ చెంది కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. 

KCR temple for sale in adilabad
Author
Hyderabad, First Published Sep 21, 2021, 4:13 PM IST

మంచిర్యాల : కెసిఆర్ పై అభిమానంతో ఓ వ్యక్తి గుడి కట్టించాడు.  అయితే తనకు పార్టీలో గుర్తింపు లేదని, కనీసం కేసీఆర్, కేటీఆర్ లను కలిపే అవకాశం కూడా రాలేదని ఆ వ్యక్తి మనస్తాపం చెందాడు.  అందుకే గుడిని గుడిలోని కెసిఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాడు.  మంచిర్యాల జిల్లా  దండేపల్లి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు రవీందర్ కెసిఆర్ పై ఉన్న అభిమానంతో తన ఇంటి ఆవరణలో కెసిఆర్ కు గుడి కట్టించాడు.

అందులో కేసీఆర్ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు కూడా చేస్తున్నాడు. అంతలా అభిమానం చాటుకున్న తనకు కెసిఆర్, కేటీఆర్ లను కలిసే అవకాశం కూడా రావడంలేదని,  టిఆర్ఎస్ పార్టీలో గుర్తింపు దక్కలేదని నిరాశ చెంది కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. 

అప్పటి నుంచి కేసీఆర్ విగ్రహానికి ముసుగు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యమంలో పాల్గొని అప్పుల పాలయ్యానని, అప్పులు తీర్చేందుకు  కెసిఆర్ గుడిని,  విగ్రహాన్ని  విక్రయిస్తున్నట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios