Asianet News TeluguAsianet News Telugu

ఓటుకు నోటు కేసు: ఉదయ్‌సింహ,సెబాస్టియన్‌లతో కలిపి రేవంత్ విచారణ

ఓటుకు నోటు కేసులో  సోమవారం నాడు విచారణ సాగుతోంది.

income tax officers inquiry on cash for vote on oct 3
Author
Hyderabad, First Published Oct 1, 2018, 11:17 AM IST


హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో  సోమవారం నాడు విచారణ సాగుతోంది.అయితే డాక్యుమెంట్ల పరిశీలన పూర్తి కానందున  ఈ నెల 3వ తేదీన విచారణను నిర్వహించనున్నట్టు ఆదాయపు పన్ను శాఖాధికారులు  రేవంత్‌రెడ్డి సహా పలువురికి సూచించారు.

మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాల సందర్భంగా సెబాస్టియన్,  ఉదయ్ సింహాల ఇండ్లలో కూడ సోదాలు నిర్వహించారు.

అంతేకాదు  రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఇండ్లలో స్వాధీనం చేసుకొన్న డాక్యుమెంట్ల పరిశీలన ఇంకా సాగుతోంది. ఈ పరిశీలన పూర్తి కాకుండా విచారణ చేయలేమని ఐటీ అధికారులు  అభిప్రాయపడుతున్నారు.

మూడు రోజుల  క్రితం సోదాల సమయంలో  వీరందరిని విచారణకు రావాలని రేవంత్ రెడ్డి సహా కొండల్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహలకు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

ఈ ఆదేశాల మేరకు సోమవారం నాడు  ఉదయ్ సింహ ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి చేరుకొన్నారు. అయితే  ఈ విషయమై  ఈ నలుగురు ఇండ్లలో స్వాధీనం చేసుకొన్న  డాక్యుమెంట్ల పరిశీలన కొనసాగుతున్నందున  విచారణ ఇప్పుడే చేయలేమని ఐటీ అధికారులు మీడియాకు చెప్పారు.

దీంతో ఈ నెల 3వ తేదీన  విచారణకు రావాల్సిందిగా రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహలకు ఐటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఇప్పటికే  ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి చేరుకొన్న ఉదయ్ సింహాను ఈ విషయమై  ఐటీ అధికారులు ఇవాళే విచారిస్తారా.. లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే  మూడు రోజుల క్రితమే ఇచ్చిన నోటీసు ఆధారంగా విచారణకు వచ్చినట్టుగా ఉదయ్ సింహా మీడియాకు చెప్పారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు

Follow Us:
Download App:
  • android
  • ios