Asianet News TeluguAsianet News Telugu

న్యూడ్ వీడియోతో బ్లాక్ మెయిల్... సైబర్ ఛీటర్ వలలో హైదరబాదీ

న్యూడ్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి యువకుడి నుండి లక్షల్లో వసూలు చేశారు సైబర్ చీటర్స్. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

hyderabad man cheated of Rs 1.5 lakh in Hyderabad akp
Author
Hyderabad, First Published Jun 27, 2021, 1:13 PM IST

హైదరాబాద్: సోషల్ మీడియాలో యువతి పేరిట పరిచయం పెంచుకుని వలపువల విసిరారు. అంతటితో ఆగకుండా అతడి న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడేలా ట్రాప్ చేశారు. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి యువకుడి నుండి లక్షల్లో వసూలు చేశారు సైబర్ చీటర్స్. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... పాతబస్తీకి చెందిన అబ్దుల్ ఖరీం అనే వ్యక్తికి సోషల్ మీడియాలో  యువతి పేరిట ప్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీంతో అతడు ఆ రిక్వెస్ట్ అంగీకరించగా పరిచయం పెంచుకుని వీడియో కాల్ మాట్లాడేలా చేశారు. యువతి న్యూడ్ గా వీడియో కాల్ చేసి అతడిని కూడా న్యూడ్ గా మాట్లాడేలా ముగ్గులోకి దించింది. ఆ వీడియోను రికార్డ్ చేసుకుని బ్లాక్ మెయిల్ కు తెరలేపారు. 

read more  అందంగా ముస్తాబై రోడ్డుపైకి... వాహనదారులను ఆకర్షించి ఈ యువతి ఏం చేస్తుందంటే..

సోషల్ మీడియాలో న్యూడ్ వీడియోను పోస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. వీరి బెదిరింపులకు భయపడి అతడు లక్షన్నర వరకు సమర్పించుకున్నాడు. అయినప్పటికి అతడికి ఇంకా వేధిస్తుండటంతో తట్టుకోలేకపోయిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios