లిప్ట్ ఇచ్చిన వారిని మార్గమధ్యలో బెదిరించి డబ్బులతో పాటు చేతికందినది దోచుకుంటున్న యువతిని విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. 

విజయనగరం: అందంగా రెడీ అయి రోడ్డు పక్కన ఒంటరిగా నిల్చుని వాహనదారులపై వలపువల విసిరి లిప్ట్ ఇవ్వాలంటూ బండెక్కుతుంది. అయితే ఇలా లిప్ట్ ఇచ్చిన వారిని మార్గమధ్యలో బెదిరించి డబ్బులతో పాటు చేతికందినది దోచుకుంటుంది. ఇలా ఇప్పటికే పలు దొంగతనాలకు పాల్పడిన యువతిని విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. 

వివరాల్లోకి వెళితే.... విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందిన యువతి(22 ఏళ్లు) తల్లి చనిపోగా తండ్రి వద్దే వుంటూ ఆమె కూలీ పనులు చేసేది. అయితే వ్యసనాలకు బానిసయిన ఆమెకు కూలీ డబ్బులు సరిపోకపోవడంతో దారిదోపిడీని ప్రారంభించింది. 

read more బర్త్ డే సెలబ్రేషన్స్ పేరిట..కాల్ గర్ల్స్ ని పిలిపించి..!

అందంగా ముస్తాబయి ఒంటరిగా రోడ్డు పక్కన నిల్చుని వాహనదారులను లిప్ట్ కావాలని కోరేది. ఆమెను నమ్మి లిప్ట్ ఇవ్వగా మార్గమధ్యలో వాహనదారులపై బెదిరింపులకు దిగేది. తనను లైగికంగా వేధించావని, అత్యాచారయత్నానికి పాల్పడ్డావంటూ గగ్గోలు పెడతానని... అలా చేయకుండా వుండాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేసేది. దీంతో ఎక్కడ పరువు పోతుందోనని భయపడి వాహనదారులు డబ్బులు ఇచ్చేవారు. ఈ డబ్బులతో జల్సాలు చేసేది. 

అయితే ఇటీవల తనను లిఫ్ట్‌ అడిగి బెదిరించి ఓ యువతి రూ.5 వేలు నగదు, పావు తులం బంగారం తీసుకుందని విశాఖకు చెందిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీ టీవీ పుటేజీల ద్వారా యువతిని గుర్తించిన పోలీసులు శనివారం అరెస్టు చేశారు.