బీటెక్ చదివిన శివాలి జోహ్ర అనే యువతి 13 గిన్నిస్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె తల్లి కవిత, తండ్రి అనిల్ శ్రీవాత్సవ కూడా ఈ రికార్డులో పాలుపంచుకున్నారు. చేతితో రూపొందించిన 2,200 క్విల్లింగ్‌ డాల్స్‌ను ఒకేచోట ఉంచి ఈ కుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పి... తాజాగా పదమూడో గిన్నిస్‌ సాధించింది.

ఇప్పటివరకు 13 గిన్నిస్ రికార్డులు, 15  అసిస్ట్‌ వరల్డ్‌ రికార్డులు, 4 యూనిక్‌ వరల్డ్‌ రికార్డులను ఈ కుటుంబం సొంతం చేసుకుంది. హైదరాబాదులోని ఒకే కుటుంబం ఇన్ని గిన్నిస్ రికార్డు సాధించడం కూడా ఓ విశేషం.

ఇంతకు ముందు శివాలి కుటుంబం హ్యాండ్ మేడ్ పేపర్ తో రూపొందించిన 1,251 విభిన్న బొమ్మలను కొలువు తీర్చి తొలి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత 7,011 కాగితం పువ్వులు ప్రదర్శించి రెండో రికార్డు, 2,111 విభిన్న బొమ్మలు, 3,501 ఆరెగామి (కాగితం) వేల్స్, 2,100 ఆరెగామి పెంగ్విన్స్, 6,132 ఆరెగామి సిట్రస్‌లు, 6,100 ఆరెగామి వేల్స్, 2,500 ఆరెగామి పెంగ్విన్స్, 1,451 ఆరెగామి మాఘీలు, 2,200 క్విల్లింగ్‌ డాల్స్, 9,200 ఆరెగామి ఫిష్, 1,998 ఆరెగామి మాఘీ లీమ్‌లను ప్రదర్శనకు ఉంచి రికార్డులను సొంతం చేసుకుంది.