కోడెల ఆత్మహత్య కేసు: సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటీషన్ కొట్టివేత
ఈ పరిణామాల నేపథ్యంలో సీబీఐ విచారణ అనవసరమని అభిప్రాయపడింది. కోర్టులో పిటీషన్ వేసిన వ్యక్తికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ పిటీషన్ ను కొట్టివేసింది హైకోర్టు.
హైదరాబాద్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది హైకోర్టు. కోడెల ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటూ అనిల్ కుమార్ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు.
అనిల్ కుమార్ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కేసులో పబ్లిక్ ఇంట్రస్ట్ ఏముందంటూ పిటిషనర్ ను నిలదీసింది. పిటిషన్‌లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం లేదని తేల్చి చెప్పింది.
కోడెల ఆత్మహత్య కేసుకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారని తెలిపింది. కోడెల ఆత్మహత్య కేసు విచారణ కొనసాగుతోందని కోడెల కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసులో ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాల్సి ఉందని అభిప్రాయపడింది. పోస్టుమార్టం, పోలీసుల దర్యాప్తులో భాగంగా ప్రాథమిక విచారణలో కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్య అని తేలిందని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీబీఐ విచారణ అనవసరమని అభిప్రాయపడింది. కోర్టులో పిటీషన్ వేసిన వ్యక్తికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ పిటీషన్ ను కొట్టివేసింది హైకోర్టు.
ఈ వార్తలు కూడా చదవండి
కోడెల సూసైడ్: సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్
ఆత్మహత్య: చివరి ఫోన్ కోడెల ఎవరికి చేశారో తెలిసింది
కోడెల ఫోన్ ఎక్కడ..? జగన్ కి ఆ అవసరం లేదు... బొత్స కామెంట్స్
కోడెల అంత్యక్రియలు... ఆయన అభివృద్ధి చేసిన స్మశానంలోనే...
పంచెతో ట్రై చేసి.. తర్వాత కేబుల్ వైర్ తో ఉరివేసుకున్న కోడెల
కోడెల సూసైడ్: రెండు మూడు రోజుల్లో శివరాం విచారణ
నివాళి: కోడెల విగ్రహాన్ని తయారుచేసిన తణుకు ఏకే ఆర్ట్స్
ముగిసిన కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు
కోడెలను నిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు?
కోడెల అంతిమయాత్రలో వివాదం: రూట్ మ్యాప్ మార్చిన పోలీసులు, ఉద్రిక్తత
కోడెల మరణం తట్టుకోలేక.. గుండెపోటుతో అభిమాని మృతి
కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...