హైద్రాబాద్‌లో డ్రగ్స్ రాకెట్: ఒకరి అరెస్ట్, వ్యాపారుల పిల్లలకు విక్రయం

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 13, Aug 2018, 12:17 PM IST
Drug racket busted: 1 held in hyderabad
Highlights

హైద్రాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. వ్యాపారుల పిల్లలను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను  పోలీసులు పట్టుకొన్నారు.


హైదరాబాద్: హైద్రాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. వ్యాపారుల పిల్లలను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను  పోలీసులు పట్టుకొన్నారు.

నిందితుల నుండి సుమారు 31 గ్రాముల కొకైన్‌ ను స్వాధీనం చేసుకొన్నారు.  హైద్రాబాద్‌లోని 27 మంది వ్యాపారుల పిల్లలకు ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. మాక్స్ అనే వ్యక్తి నుండి అబ్దుల్ అనే వ్యక్తి  డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు.

అబ్దుల్  ప్రైవేట్ ట్రావెల్స్  నిర్వహిస్తున్నాడు.  అయితే తమ సెల్‌ఫో‌న్‌లో  వ్యాపారుల పిల్లల పేర్లను  కోడ్‌ భాషలో రాసుకొన్నాడు. ఈ విషయమై పోలీసులు  నిందితుడిని అరెస్ట్ చేశారు. నాలుగేళ్లుగా అబ్దుల్  డ్రగ్స్ విక్రయిస్తున్నాడని పోలీసులు ప్రకటించారు.

loader