హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా మార్టురుకు చెందిన సతీశ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. మూసాపేట్‌‌లో నివాసముంటున్నాడు.

ఈ క్రమంలో అతను కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో శుక్రవారం ఉదయం శవమై కనిపించాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సతీశ్ ఒంటిపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.